Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణీకులు…

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణీకులు…

  • చెన్నై బేసిన్ బ్రిడ్జి వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్ నుండి మంటలు 
  • రైలు చెన్నై నుండి ముంబై వెళ్తుండగా ప్రమాదం 
  • ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం రాత్రి హఠాత్తుగా మంటలు రావడం కలకలం రేపింది. చెన్నై బేసిన్ బ్రిడ్జి వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు బోగీల నుండి బయటకు పరుగుతీశారు. ఈ రైలు చెన్నై నుండి ముంబై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరిన అరగంట తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఇక్కడి నుండి రైలు గం.6.20కి బయలుదేరింది. గం.6.48 సమయంలో మంటలు వచ్చాయి. పలువురు ప్రయాణీకులు మంటలు వస్తున్న దృశ్యాన్ని తమ ఫోన్ లలో బంధించారు. ఆ తర్వాత గం.7.15 నిమిషాలకు ఈ రైలు వ్యాసపార్ది జీవా స్టేషన్ నుండి తిరిగి బయలుదేరింది.

Related posts

హ‌ర్యానా సీఎంగా నాయ‌బ్ సింగ్ సైనీ ప్ర‌మాణం… హాజ‌రైన ఏపీ సీఎం చంద్ర‌బాబు

Ram Narayana

అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు…

Ram Narayana

రాజస్థాన్ కాంగ్రెస్ కు తలనొప్పినాగా మారిన సచిన్ పైలెట్ వ్యవహారం…!

Drukpadam

Leave a Comment