Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

షర్మిల కాంగ్రెస్ లో చేరికపై డీకే శివకుమార్ క్లారిటీ …

షర్మిల చేరికపై అధిష్ఠానం సానుకూలంగా ఉంది: కోమటిరెడ్డికి తెలిపిన డీకే శివకుమార్

  • బెంగళూరులో డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి భేటీ
  • 40 నిమిషాల పాటు చర్చలు జరిపిన నేతలు
  • షర్మిల చేరికపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన డీకే

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల హాట్ టాపిక్ గా మారారు. ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మరోవైపు షర్మిలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ విషయాన్ని స్పష్టం చేశారు. షర్మిలను పార్టీలో చేర్చుకోవడానికి పార్టీ హైకమాండ్ సానుకూలంగా ఉందని డీకే తెలిపారు. ఇదే సమయంలో నేతల అభ్యంతరాలపై కూడా ఆలోచిస్తున్నట్టు చెప్పారు. డీకేను కోమటిరెడ్డి బెంగళూరులో కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల సేపు చర్చించారు. ఈ సందర్భంగానే షర్మిల విషయంలో డీకే క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇటీవలే డీకే శివకుమార్ ను షర్మిల కలిసిన సంగతి తెలిసిందే.

ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే యత్నాలు జరుగుతున్నాయి: షర్మిల

  • కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అంటూ మీడియాలో వార్తలు
  • చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగానే ఉంటానన్న షర్మిల
  • పని లేని, పస లేని దార్శనికులు అంటూ విమర్శలు

High Command is positive about Sharmila inclusion says DK Shivakumar with Komatireddy

గత కొన్నిరోజులుగా మీడియా చానళ్లలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారన్న వార్తలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ, తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు విఫలయత్నాలు జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు. 

“పని లేని, పస లేని దార్శనికులకు నేను చేప్పేది ఒక్కటే. నా రాజకీయ భవిష్యత్ మీద పెట్టే దృష్టిని, సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి. అన్ని విధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణలోనే… నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే. జై తెలంగాణ” అని పోస్టు పెట్టారు. 

అయితే పార్టీ విలీనం ఒట్టి మాటే అని గానీ, పార్టీని కొనసాగిస్తానని గానీ షర్మిల తన పోస్టులో ఎక్కడా పేర్కొనలేదు.

 

Related posts

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు …భట్టి

Drukpadam

టీ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం!

Drukpadam

సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన అఖిలేశ్ యాదవ్!

Drukpadam

Leave a Comment