Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులపై కక్ష సాధింపు…తెరపైకి పాతకేసులు…!

ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులపై కక్ష సాధింపు …!
డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు,తుళ్లూరు బ్రహ్మయ్య పై కేసులు
పాతకేసులు తిరగ తోడటంపై మండిపడుతున్న పొంగులేటి వర్గం
దాడిచేసింది బ్రహ్మయ్య పై కేసుకూడా ఆయనపైనే
సంవత్సర కాలం క్రితం కేసుకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
బ్యాంకు లో అవకతవకలపై విజయబాబు పై సీబీసీఐడీ కేసు

 

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారనే నేపథ్యంలో ఆయన వెంట తిరిగేవారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దాదాపు కుడి బూజం ఎడమ భుజంగ ఉన్న మువ్వా విజయబాబు , తుళ్లూరు బ్రహ్మయ్య పై కేసులు పెట్టడంపై పొంగులేటి వర్గీయులు భగ్గుమంటున్నారు . అధికార పార్టీ చర్యలపై మండిపడుతున్నారు . తమ పార్టీలో ఉన్నంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారు పార్టీ మారుతున్నారని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలియగానే వేధింపులకు గురిచేయడం చేతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు . దేశం అంత బీజేపీ ప్రతిపక్షాలపై తమపై కక్ష సాధింపులకు పూనుకున్నదని గగ్గోలు పెట్టినా అధికార పార్టీ ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నింస్తున్నారు . జిల్లాలో బీఆర్ యస్ ను మట్టి కరిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని తమపై కేసులు పెడుతున్నారని అలాంటి వాటికీ భయపడి తాము ఎంచుకున్న మార్గాన్ని మార్చుకోమని డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య స్పష్టం చేశారు . ఇప్పటికే తాము బీఆర్ యస్ లో చేరితే కేసులు లేకుండా చేస్తామని చెపుతున్నారని కబుర్లు కూడా చేశారని ఎవరెన్ని ప్రలాభాలు పెట్టినా తాము శ్రీనివాస్ రెడ్డి తోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు .

ప్రభుత్వం ఉండేది మరో నాలుగైదు నెలలే ….

ప్రభుత్వం తిరిగి అధికారంకు రావడం జరిగే పని కాదని ఈసారి అధికారంలోకి వచ్చేది తాము చేరబోయే పార్టీనేనని బ్రహ్మయ్య , విజయబాబు అంటున్నారు . తనపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేయడాన్ని బ్రహ్మయ్య తప్పు పట్టారు . తనకోసం వెతుకుతుంటే దొరకటంలేదని పేర్కొనడం పచ్చి అబద్దమని అన్నారు .తాను అనేకసార్లు ఆప్రాంతంలో పర్యటించి బహిరంగంగానే సభల్లో పాల్గొన్న విషయాన్నీ మర్చి పోరాదని పేర్కొన్నారు . అబద్దాలు ఆడిన అతికినట్లు ఉండాలని ఇష్టం వచ్చినట్లు నిందలు వేయడం తగదని హితవు పలికారు ..

బ్యాంకులో జరిగిన అన్ని విషయాలు పారదర్శకమే ….విజయబాబు

తాను డీసీసీబీ చైర్మన్ గా ఉన్న కాలంలో అవకతవకలు జరిగాయని గతంలోనే 51 విచారణ జరిగిందని దానిపై కోర్టులో స్టే ఉందని అయినప్పటికీ తాను బీఆర్ యస్ తో బిభేదించాననే కారణంతోనే సీబీసీఐడీ తో విచారణ జరిపించి కొత్తగా కేసులు పెడుతున్నారని ఇది కేవలం రాజకీ కక్ష మాత్రమేనని అన్నారు .దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు .

Related posts

మమతా బెనర్జీకి ఈసీ షాక్‌.. దీదీ ప్రచారంపై 24 గంటల నిషేధం!

Drukpadam

ద్రౌపదికే నా మద్దతు.. విపక్షాలు నన్ను సంప్రదించలేదు: మాయావతి!

Drukpadam

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ నారాయణ!

Drukpadam

Leave a Comment