అంబటికి కన్నీటి వీడ్కోలు
-అంతిమయాత్రలో ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి ఏపీయూడబ్ల్యూ జె టీయూడబ్ల్యూజే నాయకులు
ఆదివారం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు, ఐజేయూ సీనియర్ నాయకులు అంబటి ఆంజనేయులు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం విజయవాడలో జరిగాయి. అంతకు ముందు ఆయన నివాసం వద్ద బౌతికకాయాన్ని ఉంచి అక్కడ నుంచి ప్రజల సందర్శనార్థం విజయవాడ ప్రెస్ క్లబ్ కు తీసుకోని వచ్చారు . రెండు రాష్ట్రాలలలోని వివిధ జిల్లాలనుంచి తరలివచ్చిన జర్నలిస్టులు , ఆయన శ్రేయోభిలాషులు , ఏపీ ప్రభుత్వ అధికారులు నివాళులు అర్పించారు . అంత్యక్రియల్లో ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొని నివాళి అర్పించారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్,ఐజేయూ ఉపాధ్యక్షులు డి .సోమసుందర్ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షకార్యదర్శులు ఐ వి సుబ్బారావు , చందు జనార్దన్ ,చావరవి ,బాబు , చలపతి రావు , జయప్రకాశ్ , నగేష్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీ, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, ఆలపాటి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాంనారాయణ, కార్యదర్శి మధుగౌడ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు డి.కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, సామినేని కృష్ణమురహరి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివాస్ రావు , ఖమ్మం నగర కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.