Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బీఆర్ యస్ ,బీజేపీ ఒక్కటే ….కాంగ్రెస్ ధ్వజం,,,

బీఆర్ యస్ ,బీజేపీ ఒక్కటే ….కాంగ్రెస్ ధ్వజం,,,,
పరస్పర ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తున్నాయి…
కర్ణాటక పార్మాలతో తెలంగాణాలో ముందుకు పోతాం ..రేవంత్
తెలంగాణ, మహారాష్ట్రలో బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తోంది: ఠాక్రే
ఎన్నికలు టార్గెట్ గా ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశమని వెల్లడి
తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ లూఠీ చేశారని వ్యాఖ్య
తెలంగాణలో కేసీఆర్ పాలనలో అవినీతి పేట్రేగిపోయిందని ఆరోపణ
ముఖ్య నాయకులం కలిసి బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు సన్నద్ధులమవుతామని వ్యాఖ్య

బీఆర్ యస్ ,బీజేపీ ఒక్కటే ఇది మేము అంటున్నదికాదు ….తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు . ఇది నిజం …పరస్పర ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే , రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ ముఖ్యనేతల సమావేశం జరిగింది. తెలంగాణ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం రాష్ట్ర వ్యహారాలు ఇంచార్జ్ మాణిక్యరావు ఠాక్రే , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , వి .హనుమంతరావు , మధు యాష్కీ , షబ్బీర్ అలీ తదితరులు మీడియా తో మాట్లాడాడు …

సమావేశంలో తెలంగాణ ఎన్నికల టార్గెట్ గానే సమావేశం జరిగిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును లూఠీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో ఏఏ అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. తెలంగాణలో పరిస్థితులపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారని, కానీ సామాన్య ప్రజల ఆశయాలు, ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదన్నారు.

తెలంగాణ ప్రజలు దోపిడీకి గురవుతున్నారని వాపోయారు. బీఆర్ఎస్ పాలన పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు. మహారాష్ట్ర, తెలంగాణలో బీఆర్ఎస్.. బీజేపీతో కలిసి పని చేస్తోందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి …

120 రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ఎలా ముందుకు సాగాలనే అంశంపై తాము చర్చించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగిందన్నారు. పదేళ్ల టీఆర్ఎస్ వైఫల్యాలను, కేంద్రంలోని మోదీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు ఎలా వివరించాలో ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్ పాలనలో అవినీతి పేట్రేగిపోయిందన్నారు. అవినీతి ఆకాశానికి పొంగితే, అభివృద్ధి పాతాళంలో ఉందనే విషయాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. ముఖ్య నాయకులం కలిసి బీఆర్ఎస్ ను గద్దె దించడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధులమై సాగుతామన్నారు.

తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైందన్నారు. ఈ సన్నాహక సమావేశం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు స్పష్టంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తమ అనుభవాలను తమకు చెప్పారన్నారు. కర్ణాటకలో ఏ ఫార్ములాతో కాంగ్రెస్ ఎన్నికలను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, అలాంటి కార్యాచరణతో తెలంగాణలో ముందుకు సాగుతామన్నారు. కర్ణాటకలో పాటించిన కొన్ని మౌలికసూత్రాలను తెలంగాణలోను పాటిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తామన్నారు.

Related posts

ప్రజలపక్షాన ప్రభుత్వంపై పోరాడతానన్న కాంగ్రెస్ నేత మధు యాష్కీ!

Ram Narayana

స్టాలిన్ దేశ ప్రధాని ఎందుకు కాకూడదు?: ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

రాహుల్ గాంధీ బ్రిటన్ లో ప్రసంగంపై వివరణకు బీజేపీ నో …

Drukpadam

Leave a Comment