Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ కుటుంబంపై మోదీ డైరెక్ట్ అటాక్…

కేసీఆర్ కుటుంబంపై మోదీ డైరెక్ట్ అటాక్…

  • కేసీఆర్ కూతురుకు మేలు చేయాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న మోదీ
  • మీ కుటుంబ సభ్యులకు మేలు జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని వ్యాఖ్య
  • భోపాల్ సభలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన మోదీ

ఒకపక్క బీఆర్ యస్ కు బీజేపీకి సంభందాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ బీఆర్ యస్ పై నేరుగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ జాతీయస్థాయిలో బీఆర్ యస్ కు ప్రత్యాన్మాయం తానే నంటూ భారతీయ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టారు . బీజేపీ ఓడించే శక్తి తమకే ఉందని వచ్చే లోకసభ ఎన్నిలకల్లో సత్తా చాటుతామని చెపుతుండగా ,అదేం లేదు బీఆర్ యస్ , బీజేపీ వేరువేరు కాదని ఒక్కటేనని వివిధ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. బీఆర్ యస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో పోటీచేయలేదు …మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే మూడు సార్లు మహారాష్ట్రలో పర్యటించిన కేసీఆర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం 600 వాహనాలు మంది మార్బలంతో అక్కడకు వెళ్లారు . కేసీఆర్ పర్యటన అక్కడ బీజేపీకి ఉపయోగపడేదిగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ సైతం వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.

బీఆర్ యస్ తో దోస్తీ మరకను చెరిపేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నం చేశారు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూతురు కవితకు లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని, మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో భోపాల్ లో నిర్వహించిన ఐదు రాష్ట్రాల బూత్ కమిటీల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Related posts

కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ!

Drukpadam

యుద్ధానికి నేను సిద్ధం…!మాజీ ఎంపీ పొంగులేటి

Drukpadam

మోడీకి మమతాబెనర్జీ గుడ్ సర్టిఫికెట్ …

Drukpadam

Leave a Comment