Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా తో 35 లక్షల మంది మరణం ….

కరోనా తో 35 లక్షల మంది మరణం ….
-జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ డేటా ప్రకారం.. అక్షరాల 35 లక్షలు
-17 కోట్ల మంది వైరస్ భారిన పడ్డారు
-భారత్ లో 26 లక్షల కేసులు -2 లక్షల 90 వేలమంది మరణించారు
-అమెరికాలో 33 లక్షలమందికి కరోనా 5 .88 లక్షల మంది మరణించారు
-బ్రెజిల్ లో 15 లక్షల మందికి కరోనా -4 .41 లక్షలమంది మృతి
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇంతటి ఘోర విపత్తు ప్రపంచయుద్ధాలలో సైతం జరగలేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. యుద్ధం అనేది కొన్ని దేశాలు కొన్ని ప్రాంతాలమధ్యనే జరగగా కరోనా ప్రపంచంలో ఉన్న అన్నిదేశాలను చుట్టుముట్టింది. ఐక్యరాజ్యసమితిలో 198 దేశాలు మాత్రమే ఉండగా ,కరోనా మొత్తం చిన్న పెద్ద అన్ని కలుపుకుని 221 దేశాలలో కల్లోలం రేపింది. అధికారిక లెక్కల ప్రకారమే 35 లక్షల మంది మరణించగా అనేక 17 కోట్ల మంది ఈ వ్యాధిబారిన పడ్డారు. అయితే ఇంతకూ మూడు రేట్లు అధికంగా ఉండవచ్చునని అంటున్నారు.
కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో మరింతగా వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రపంచ దేశాలను సైతం పట్టి పీడిస్తున్న కరోనా.. కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంలో లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అమెరికాకు చెందిన జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ డేటా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 లక్షల మంది మరణించారు. సుమారు 17 కోట్ల మందికి వైరస్‌ సంక్రమించింది. అమెరికాలో 33.0 లక్షల మందికి వైరస్‌ సోకగా, 5.88 లక్షల మంది మరణించారు. ఇక భారత్‌లో 26 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2.90 లక్షల మంది మరణించారు. బ్రెజిల్‌లో కూడా మరణాల సంఖ్య భారీగానే ఉంది. బ్రెజిల్‌లో 15 లక్షల మంది వైరస్‌ బారిన పడగా, అందులో 4.41 లక్షల మంది మృతి చెందారు.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య అధికారిక లెక్కల కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది. అనేక ప్రపంచ దేశాలు ఇంకా ఈ మహమ్మారిపై పోరాటం చేస్తూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే .. మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.

Related posts

ఉభయ తెలుగు రాష్ట్రాలలో దంచి కొడుతున్న వర్షాలు…

Drukpadam

ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి

Drukpadam

Leave a Comment