Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఉమ్మడి పౌర స్మృతిపై భిన్నవాదనలు …

ఉమ్మడి పౌర స్మృతికి ఆప్ ‘సూత్రప్రాయ‘ మద్దతు!

  • ఆప్ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ కీలక వ్యాఖ్య
  • ఈ అంశంపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరపాలని సూచన
  • ఏకాభిప్రాయం కోసం కృషి చేయాలన్న సీనియర్ నేత

ఉమ్మడి పౌర స్మృతికి తమ పార్టీ సూత్రప్రాయ మద్దతు తెలుపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ తాజాగా పేర్కొన్నారు. అయితే, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపాకే ముందుడగు వేయాలన్నారు. ఏకాభిప్రాయం కోసం కృషి చేయాలని సూచించారు.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఉమ్మడి పౌర స్మృతి అంశం తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒక దేశంలో రెండు చట్టాలు ఎందుకని సాక్షాత్తూ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆప్ నేత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే, ప్రధాని వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చీలికలు పెద్దవవుతాయని హెచ్చరించింది.  ఆధిపత్య భావజాలంతో తనదైన ఎంజెడాతో ముందుకెళుతున్న ప్రభుత్వం ప్రజలపై ఉమ్మడి పౌర స్మృతిని  బలవంతంగా రుద్దకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. కాగా, ముస్లిం మత సంస్థలు కూడా ఈ అంశంపై చర్చలు ప్రారంభించాయి. రోడ్డెక్కి నిరసనలకు దిగొద్దంటూ ముస్లింలకు జమైత్ ఉలేమా ఏ హింద్ బోర్డు సభ్యుడు అర్షద్ మద్ని విజ్ఞప్తి చేశారు.

మేం చేయగలిగింది ఏముంది..ఉమ్మడి పౌర స్మృతిపై జమైత్ ఉలేమా హింద్ చీఫ్ వ్యాఖ్య

  • ముస్లింల హక్కులు లాగేసుకుంటామని ప్రధాని అన్నారన్న మౌలానా అర్హద్ మదానీ
  • ఈ పరిస్థితిల్లో చేయగలిగింది ఏముందని వ్యాఖ్య
  • ప్రధాని ప్రకటన అనంతరం ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం
  • తమ అభిప్రాయాలను లా కమిషన్‌కు నివేదించాలని నిర్ణయం
Jamiat Chief Invokes Babri Masjid Says What Could We Do

ఉమ్మడి పౌర స్మృతిపై ముస్లింలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారని కానీ, తమ వినతి ఆలకిస్తారన్న ఆశలు పెద్దగా లేవని జమైత్-ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ అన్నారు. ‘‘ఈ విషయంలో ఎవరైనా చేయగలిగింది ఏముంటుంది? ముస్లింల మత హక్కులను తీసేసుకుంటామని ప్రధాని బహిరంగంగానే చెప్పారుగా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, ప్రధాని ప్రకటన అనంతరం ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశం అనంతరం లా బోర్డు సభ్యులు తమ అభిప్రాయాలను లా కమిషన్‌ ముందుంచాలని నిర్ణయించారు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ఏదో చేస్తుందని తాము ఆశించట్లేదని వ్యాఖ్యానించారు.

Related posts

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి….ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయం …అమెరికా పర్యటనలో రాహుల్ …

Drukpadam

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ…

Ram Narayana

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపును ప్రకటించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment