Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

అవును.. మేము కుటుంబ రాజకీయాలు చేస్తున్నాం: స్టాలిన్

అవును.. మేము కుటుంబ రాజకీయాలు చేస్తున్నాం: స్టాలిన్

  • డీఎంకే కుటుంబ రాజకీయాలు నడుపుతోందన్న మోదీ
  • పార్టీలోని సభ్యులందరం కుటుంబ సభ్యుల్లా మెలుగుతామన్న స్టాలిన్ 
  • కరుణానిధి కుటుంబం అంటే రాష్ట్ర ప్రజలేనన్న సీఎం  

తమిళనాడులో డీఎంకే కుటుంబ రాజకీయాలను నడుపుతోందని ప్రధాని మోదీ చెప్పడం అక్షరాలా నిజమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. డీఎంకేలోని సభ్యులంతా ఒక కుటుంబంలా మెలుగుతూ రాజకీయాలు చేస్తున్నామనే విషయాన్ని అంగీకరిస్తున్నానని చెప్పారు. పార్టీలోని సభ్యులందరం కుటుంబ సభ్యుల్లా మెలుగుతామని అన్నారు. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై పార్టీలోని అందరినీ తమ్ముడూ అని సంబోధించేవారని… కరుణానిధి కూడా తోబుట్టువులారా అని పిలిచేవారని చెప్పారు. కరుణానిధి కుటుంబం అంటే రాష్ట్ర ప్రజలేనని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్ లో గత 50 రోజులుగా హింసాకాండ జరుగుతున్నా మోదీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని మోదీ ప్రకటించడం కూడా మతం, కులం పేరుతో ఘర్షణలు జరిగేందుకేనని చెప్పారు.

Related posts

టీఆర్ఎస్సా?, బీఆర్ఎస్సా?.. మునుగోడు బైపోల్‌లో గులాబీ అభ్య‌ర్థి పార్టీ పేరుపై డైల‌మా!

Drukpadam

తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది :జెపి నడ్డా !

Drukpadam

హథ్రాస్ విషాదం: తెల్లటి సూట్, టైతో బోధనలు… ఎవరీ భోలే బాబా?

Ram Narayana

Leave a Comment