Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రజాభీష్టం మేరకే కాంగ్రెసులోకి …మాజీఎంపీ పొంగులేటి…!

ప్రజాభీష్టం మేరకే కాంగ్రెసులోకిమాజీఎంపీ పొంగులేటి…!
బీఆర్ యస్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లలో కాంగ్రెస్ విజయడంఖా మోగిస్తుంది
రాహుల్ గాంధీ సభను అడ్డుకోవడం అంటే తల్లిపాలుతాగి రొమ్మును గుద్దిన చందంగా ఉంటుంది.
మంత్రికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ ..చట్ట సభల్లోకి పంపింది కాంగ్రెస్
ఆర్టీసీ బస్సు లు అద్దెకు ఇవ్వమంటే అడ్డుకోవడం అవివేకం
మాటల మాంత్రికుడు కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

దృక్పధంతో పొంగులేటి ప్రత్యేకం

తాను ప్రజాభీష్టం మేరకే కాంగ్రెస్ లోకి వెళుతున్నానని ఆదివారం ఖమ్మం లో జరిగే తెలంగాణ ప్రజాగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరతానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు . పొంగులేటి చేరిక పై దృకపదం పలకరించగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు.

ఖమ్మం ఎంపీగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన తాను ,ఎంపీ గానే కాకుండా ఆనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉండి దానికి రాజీనామా చేసి కేసీఆర్పిలుపు మేరకు ఆనాడు అధికారంలోఉన్న టీఆర్ యస్ లో చేరాను .స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం నాశక్తి మేరకు కృషి చేశాను 2018 ఎన్నికల్లో జరిగిన శాశనసభ ఎన్నికల్లో పార్టీ అప్పగించిన బాధ్యతల మేరకు మధిర నియోజకవర్గంలో పని చేశాను . అయితే ఎన్నికల్లో తాను పాలేరు లో తుమ్మలను , వైరాలో మదన్ లాల్ ను ఓడించానని నామీద కొంతమంది చాడీలు చెప్పారుఅది ఆయన నమ్మారు.. దీంతో కక్ష గట్టారు … 2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు .ఇదేమంటే సామజిక సమీకరణాలని అన్నారు . తర్వాత రాజ్యసభ సీటు ఇస్తామన్నారు . అది లేదుపార్టీలో చేరుతున్నప్పుడు ఇదే కేసీఆర్ తిరిగి ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వడంతోపాటు తనతోపాటు తనను నమ్ముకొని టీఆర్ యస్ లోకివచ్చినవాళ్ళను పదవులు ఇస్తామని అన్నారు .అది జరగలేదు . విషయాన్ని పలుమార్లు కేటీఆర్ దగ్గర ప్రస్తావించానుఫలితం లేకుండా పోయింది . కేసీఆర్ ను స్వయంగా కలిసి మాట్లాడదామని అనేక సార్లు ప్రయత్నించాను అయినా ఆయన అవకాశం ఇవ్వలేదుకేటీఆర్ అనేక సార్లు ప్రయత్నించినా అవి ఫలించలేదు ..

ఎంపీ పదవి ఉన్న లేకున్నా ప్రజల్లో ఉండాలనే కోరిక ఉండేదిఅదే నన్ను రాజకీయాల్లో కొనసాగేలా చేసింది. 360 రోజుల్లో ఏవో కొన్ని రోజులు తప్ప ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాలు తిరిగానునేరుగా ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నాను . అసందర్భంగానే కేసీఆర్ పాలనపై ప్రజల్లో భ్రమలు తొలుగుతున్నాయని గ్రహించానుఆయన చెప్పే మాటలకూ చేసే పనులకు పొంతనలేదని తేలింది . రైతుల రుణమాఫీ , దళితులకు మూడెకరాలు , దళిత బంధు మాటలకే పరిమితమైంది . అక్కడో ఇక్కడో ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారు . రైతు బంధులో లోపాలు ఉన్నాయని అనేక మంది మేధావులు చెప్పారు .

ఒక సందర్భంలో రాజకీయాల్లో ఉండాలా ..? లేదా ?…ఉంటె నా మార్గం ఏమిటి …? అని చాల రోజులు ఆలోచనలు చేశాను . అనేక మంది హితులు , సన్నిహితుల దగ్గర అభిప్రాయాలు పంచుకున్నానుఉండాలనుకుంటే మరో మార్గం వెతుక్కోవాల్సిందేకేసీఆర్ ను గద్దెదించాలని నాతోపాటు అనేక మంది అనుకుంటున్నారు . వారినందరిని ఐక్యం చేయాలనీ భావించానుఅందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే మా ముందు మూడు మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బీజేపీ ,రెండు కాంగ్రెస్ మూడవది ప్రత్యేక పార్టీ , ప్రత్యేక పార్టీ సాధ్యం కాదనేది తేలింది. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలతో పలుమార్లు చర్చలు జరిగాయి. చివరకు బీజేపీ తో బీఆర్ యస్ ను ఓడించడం సాధ్యం కాదని మెజార్టీ అభిప్రాయాలు వచ్చాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దీంతో కాంగ్రెస్ లో చేరాలని నా హితులు సన్నిహితులు చెప్పారు . ప్రజల అభీష్టం కూడా అదే ఉందిరాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ ను ఓడించడమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పదికి పది సీట్లు గెలిచి తీరాలంటే కాంగ్రెస్ కు ఉన్న బలంతో తమ బలాన్ని తోడు చేస్తే అనుకున్న ఫలితాలు సాదించ వచ్చునని అనుకున్నాం .. అందరి అభిప్రాయాలు తీసుకున్నాంవారి అందరు కాంగ్రెస్ లో చేరాలని మమ్మల్ని కోరారు . దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముందు తమ ప్రతిపాదనలు పెట్టాం వారు అంగీకరించారు . ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జన ఖర్గే ..రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీని కలిసి పార్టీలో చేరేందుకు తమ సమ్మతిని తెలిపాంవారు కూడా మా నిర్ణయాన్ని స్వాగతించారు . రాహుల్ ను ఖమ్మ సభకు ఆహ్వానించాంవారి సమక్షంలో చేరుతామని అన్నాం ..వారు అందుకు అంగీకరించి జులై 2 తేదికి టైం ఇచ్చారు . జిల్లా కు చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ముగుస్తున్నందున రెండు కలిసి వస్తాయని తేదీ పెట్టుకున్నారు .

సభకు అడ్డంకులు ఏమిటి …?

రాహుల్ ఖమ్మం సభ అనగానే ప్రజల్లో మంచి జోష్ వచ్చింది. మీటింగ్ కు వస్తాం మాకు వాహనాలు పంపంపని వందల గ్రామాల నుంచి అడుగుతున్నారు . దీన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ వారిని 12 వందల వాహనాలు అద్దెకు కావాలని అడిగాం ..అధికారులు సమ్మతి తెలిపారు .దానికి కావాల్సిన డబ్బు చెల్లించేందుకు వెళ్లగా మాకు పై నుంచి వత్తిడి ఉంది.ఇవ్వలేమని అన్నారు .ఖమ్మం చుట్టూ చెక్ పోస్ట్ లు పెట్టారు . వాహనదారుల దగ్గర ఆర్సీలు తీసుకున్నారని తెలిసింది.ఖమ్మం నగరం లో పంపులు కూడా రెండు రోజులు వదల కుండా ఆదివారం రాహుల్ వచ్చే టైం కు వదిలితే సభకు ప్రజలు వెళ్లకుండా చేయాలనీ కుట్ర చేస్తున్నారని సమాచారం .ఇవి అన్ని చిల్లర వ్యవహారాలుతెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ వస్తుంటే ఆయన సభకు వెళ్లకుండా ఆటంకాలు కల్పించడమా…? మంత్రికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ ..చట్ట సభల్లోకి పంపింది కాంగ్రెస్ దాన్ని కూడా విస్మరించి తల్లిపాలుతాగి రొమ్మును గుద్దిన చందంగా వ్యవరించడం తగదని పొంగులేటి హితవు పలికారు . ఇది వారి అల్పబుద్ధికి నిదర్శనంఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆటంకాలు కల్పించినా లక్షలాదిగా తరలివస్తున్న ప్రజాప్రవాహాన్ని అడ్డుకోలేరనేది గుర్తుంచుకోవాలని అన్నారుఅధికార పార్టీకి కొందరు అధికారులు సహకరిస్తున్నారు . వారికీ ఒకటే చెప్పదల్చుకున్న అధికారం శాశ్వితం కాదుకొద్దీ నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పడు లెక్క తేలుస్తామని అన్నారు . అధికారులు రాజకీయాల్లో రాదల్చుకుంటే గులాబీ చొక్కా తోడుక్కోండని పొంగులేటి సలహా ఇచ్చారు .

తనపై ,విజయబాబు పై హత్య హత్నం ….

తనపైన తన డీసీసీబీ మాజీ చైర్మన్ పైన దాడులు చేయాలనీ హత్య చేయాలనీ అనుకుంటున్నట్లు సమాచారంచంపండి ఎంతమందిని చంపుతారో చూస్తాందీనిపై సీపీ ప్రకటన చూశాంమాకు అప్పడు బెదిరింపులు లేవు, ఇప్పడు ఉన్నాయి. ఎవరు ఫిర్యాదు చేయలేదని , విజయబాబుకు త్రేట్ ఉన్నట్లు తమ నోటీసులో లేదని కూడా చెప్పారు . అప్పడు ఉన్నదని చెప్పలేదుఇప్పుడు చెపుతున్నాంఇందుకు కొన్ని గోడ పోస్టర్లు కూడా వేశారు . ఒక గోడకు ఉన్న పోస్టర్ ను ఒక పెద్దాయన పీక్కొని వచ్చి నాకు చూపించారువీటిని ఎవరు వేశారో పోలీసులు విచారని జరిపి నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు . తమ కార్యకర్తలకు ఏమైనా జరిగితే తాను మీటింగ్ లో ఉండను కార్యకర్త ఇంటిదగ్గర ఉంటానని అభయం ఇచ్చారు ….

Related posts

లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు!

Drukpadam

కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలయింది: కడియం శ్రీహరి!

Drukpadam

పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా?: కేసీఆర్‌ను ప్ర‌శ్నించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి!

Drukpadam

Leave a Comment