Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితులపై ఐఎంఎఫ్ ఆందోళ‌న‌…

భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితులపై ఐఎంఎఫ్ ఆందోళ‌న‌
-భారత్ లో రానున్న కాలం మరింత దారుణంగా ఉండొచ్చు
-ఈ ఏడాది చివరి నాటికి భార‌త్‌లో 35 శాతం మందికే వ్యాక్సిన్
-భార‌త్‌లో రోగుల‌కు ఆక్సిజన్, బెడ్లు, ఔష‌ధాలు అంద‌ట్లేదు
-చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు
-భారత్ లో మరణాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడి
-మధ్య ఆదాయ దేశాలన్నింటికీ ఇదో హెచ్చరిక

భార‌త్‌లో ప్ర‌తిరోజు న‌మోద‌వుతోన్న క‌రోనా కేసులు, మృతుల సంఖ్య ప‌ట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నది .ప్రపంచంలో 17 కోట్లమంది వైరస్ భారిన పడగా 35 లక్షలమంది చనిపోయారని లెక్కలు చెబుతున్నాయని ,భారత దేశంలో 26 లక్షల కేసులు ఉండగా 2 .90 లక్షలమంది మరణించారని సరైన చర్యలు తీసుకోకపోతే ఇంకా మరింతమంది మరణించే ఆవకాశం ఉందని హెచ్చరించింది. దేశంలో రానున్న కాలం మరింత దారుణంగా ఉండవచ్చునని అభిప్రాయపడింది .బెడ్లు దొరకడంలేదు. ఆక్సిజన్ కొరత మందుల కొరత ఉంది. భార‌త్‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని పేర్కొంటూ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నాటికి భార‌త్‌లో 35 శాతం మంది జనాభాకు మాత్రమే వ్యాక్సిన్లు అందుతాయని అందులో పేర్కొంది. తొలి ద‌శ‌ కరోనా విజృంభ‌ణ‌ను బాగానే తట్టుకున్న భారత్ లో రెండో ద‌శ విజృంభ‌ణ‌లో మాత్రం అసాధార‌ణ ప‌రిస్థితులు తలెత్తుతున్నాయ‌ని వివ‌రించింది. భార‌త్‌లో రోగుల‌కు ఆక్సిజన్, బెడ్లు, ఔష‌ధాలు, సౌకర్యాలు అంద‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని చెప్పింది. ఆఫ్రికాతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రమైన తొలి ద‌శ‌ ముప్పును తప్పించుకోగలిగిన అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు భారత్ లో నెల‌కొన్న పరిస్థితులు ఓ హెచ్చరిక లాంటివ‌ని ఐఎంఎఫ్ తెలిపింది.

2021 చివరికల్లా భారత్ లో వ్యాక్సినేషన్ శాతం 35 లోపే ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. భారత్ 60 శాతం మందికి వ్యాక్సిన్ అందించాలంటే 100 కోట్ల డోసులు అవసరం అని అభిప్రాయపడింది. ఇదే స‌మ‌యంలో ధ‌నిక‌ దేశాల్లో ఇప్ప‌టికే 50 శాతం నుంచి 70 శాతం మ‌ధ్య వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని పేర్కొంది. ఆఫ్రికా జ‌నాభాలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రెండు శాతం లోపు జ‌నాభాకే వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని తెలిపింది. అమెరికాలో 40 శాతం పైగా జ‌నాభాకు వ్యాక్సిన్ వేశార‌ని తెలియజేసింది. మున్ముందు ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఆక్సిజన్, పడకలు, ఔషధాలు లేక మరణాలు పెరగొచ్చని వెల్లడించింది. భారత్ లో నెలకొన్న పరిస్థితులు తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు ఓ హెచ్చరిక అని ఐఎంఎఫ్ పేర్కొంది. వ్యాక్సిన్ల ఎగుమతులపై అడ్డంకులను భారత్ తొలగించాలని స్పష్టం చేసింది.

Related posts

సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ రమణ అసహనం!

Drukpadam

తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి… బాలకృష్ణకు కృతజ్ఞతలు!

Drukpadam

సీఎం పదవికి వైయస్ జగన్ రాజీనామా…ఆమోదించిన గవర్నర్

Ram Narayana

Leave a Comment