Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్, బీజేపీ బంధువుల పార్టీ…ఖమ్మం భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ..!

బీఆర్ యస్, బీజేపీ బంధువుల పార్టీ…ఖమ్మం భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ

బీఆర్ యస్ ముమ్మాటికీ బీజేపీకి బీటీమే

తెలంగాణలో బీజేపీ ఖేల్ కథం …బీఆర్ యస్ ,కాంగ్రెస్ మధ్యనే పోటీ…
బీజేపీ వాహనం నాలుగు టైర్లు ఒకేసారీ పంక్చర్ అయ్యాయి
బీఆర్ యస్ పాల్గొనే సమావేశాల్లో కాంగ్రెస్ పాల్గొనదు…
కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయని రాహుల్ ధీమా…
వృద్దులకు , వితంతువులకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెన్షన్ రూ. 4వేలు చేస్తామని ప్రకటన …
నెరవేరని తెలంగాణ ప్రజల కల …ప్రజల సాకారం కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండని పిలుపు …

టిఆర్ఎస్ బీఆర్ యస్ గా మారి బీజేపీ చుట్టాల పార్టీగా పని చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు . ఆరెండు పార్టీల బంధం ,బంధుత్వం . కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పని చేస్తుంటే బిజెపి విద్వేషాన్ని, ద్వేషాన్ని కలిగిస్తుందని మేము కలపడం చేస్తుంటే వారు విడదీస్తున్నారని బీజేపీ విధానాలపై తీవ్ర స్వరంతో ద్వజామెత్తారు . ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ఆలోచింపచేసేవిధంగా ఉంది . ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. 

 

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని అభివర్ణించారు. మీ మనసుల్లో, మీ రక్తంలో కాంగ్రెస్ ఉందని  అన్నారు. పీపుల్ మార్చ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అభినందిస్తున్నట్టు తెలిపారు. భట్టి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు భరోసా ఇచ్చారని కొనియాడారు. 

ఈ సభ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నందుకు పొంగులేటికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు. పొంగులేటి పులిలా పోరాడుతున్నారని అభినందించారు. 

ఒకప్పుడు తెలంగాణ అనేది పేదలకు, రైతులకు, అందరికీ ఓ స్వప్నంలా ఉండేదని… కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిన ఆ స్వప్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ల పాటు ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కేసీఆర్ తెలంగాణకు తానో రాజులా భావిస్తుంటారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తన జాగీరు అనుకుంటున్నారని విమర్శించారు. 

“ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నారు. ఈ భూములు కేసీఆర్ వి కావు… మీవి. టీఆర్ఎస్ ఏకంగా తన పేరే మార్చుకుంది. పార్లమెంటులో బీజేపీకి బీ టీమ్ లా పనిచేసింది. రైతుల బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే, ఆ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ముఖ్యమంత్రి దాన్ని సమర్థిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లో ఉంది. కేసీఆర్ స్కాములన్నీ మోదీకి తెలుసు. 

ధరణి భూముల సమస్యను భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలుసుకున్నా. మిషన్ భగీరథలో కోట్లు దోచుకున్నారు. కాళేశ్వరం ప్రాజక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. అన్ని విధాలుగా ప్రజలను దోచుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఐదు అంశాలతో వరంగల్ డిక్లరేషన్ చేసింది. దాని తర్వాత హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ చేసింది. ఈ ఖమ్మం సభ ద్వారా ఓ చారిత్రాత్మక నిర్ణయం ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వృద్ధులకు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. ఈ నిర్ణయం పేదల జీవితాల్లో మార్పు తెస్తుందని భావిస్తున్నాం. ఆదివాసీలకు పోడు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తాం. 

ఇటీవలే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. అక్కడ నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం ఉండేది. ఆ అవినీతి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి కుటుంబం అండగా నిలిచింది. 

గతంలో, తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ అనేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. బీజేపీ ఎప్పుడో ఖతమ్ అయిపోయింది. ఏమైందో తెలియదు కానీ, బీజేపీ బండికి నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయి. పోటీ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే. కర్ణాటకలో ఎలాగైతే బీజేపీని ఓడించామో, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి బీ టీమ్ గా ఉన్న బీఆర్ఎస్ ను కూడా అలాగే ఓడించబోతున్నాం. 

ఇటీవల ఢిల్లీలో విపక్షాల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బీఆర్ఎస్ వస్తే మేం సమావేశానికి హాజరు కాబోమని స్పష్టంగా చెప్పాం. నేతల కోసం కాంగ్రెస్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మా ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చినవారు ఎవరైనా రావొచ్చు” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

 

BRS, BJP relatives party…Rahul Gandhi in a huge open meeting in Khammam

BRS is all BJP’s BT

Khel story of BJP in Telangana… BRS, Congress contest…
Four tires of the BJP vehicle were punctured at once
Congress will not participate in meetings in which BRUS participates…
Rahul is confident that Karnataka results will come in Telangana too…
When the Congress came to power, the pension for old men and widows was Rs. 4,000 will be announced…
The unfulfilled dream of Telangana people… Call to support Congress for the realization of the people…

Congress leader Rahul Gandhi has criticized that TRS has become BRS and is working as a party of BJP. The bond and kinship of the six parties. While the Congress party is working to keep the country united, the BJP is creating hatred and hatred, if we are uniting them, they are dividing the country, he said in a loud voice on the policies of the BJP. Rahul Gandhi’s speech in the Congress-led meeting at Khammam on Sunday was thought provoking. Congress leader Rahul Gandhi gave an enthusiastic speech after seeing the huge crowd at the Janagarjana Sabha on the Khammam ground. While Rahul delivered the speech in Hindi, Uttam Kumar Reddy translated it into Telugu.

He described Khammam district as a stronghold of the Congress party. He said that Congress is in your hearts and in your blood. CLP leader Bhatti said that he appreciates Vikramarka for the people’s march. Bhatti was praised for having traveled thousands of kilometers and given assurance to the poor.

He said that he is welcoming Ponguleti Srinivasa Reddy into the Congress party through this meeting. He explained that he was thanking Ponguleti for joining Congress from BRS. He congratulated Ponguleti for fighting like a tiger.

Rahul Gandhi criticized that once Telangana was a dream for the poor, farmers and everyone… BRS party destroyed that dream which was realized by the Congress party for nine years. He criticized that KCR thinks he is the king of Telangana and that he thinks Telangana state is his fiefdom.

“KCR grabbed the lands given to the poor by Indiramma. These lands are not KCR’s… You. TRS changed its name together. It worked like a B team for BJP in Parliament. If the Congress party opposed the Farmers’ Bill, the BRS supported that bill. Whatever decision PM Modi takes, this Chief Minister He is defending it. The remote control of this chief minister is in Modi’s hands. Modi knows all the scams of KCR.

I learned about the issue of Dharani lands during the Bharat Jodo Yatra. Crores were looted in Mission Bhagiratha. A corruption of one lakh crores was committed in the Kaleshwaram project. People were robbed in every way.

The Congress Party made the Warangal Declaration with five points. After that Youth Declaration was made in Hyderabad. We are announcing a historic decision through this Khammam Sabha. When the Congress party comes to power, we will give a pension of Rs.4 thousand to the elderly and widows. We hope that this decision will bring a change in the lives of the poor. Adivasis will be given full rights over waste lands.

Elections were recently held in Karnataka. There was an anti-poor government. Congress party defeated that corrupt government. Every family stood behind the Congress party in Karnataka.

In the past, there was a triangular competition between BRS, BJP and Congress in Telangana. There is no situation yet. BJP is over. I don’t know what happened, but four tires of the BJP cart got punctured. All competition is between BRS and Congress. As we defeated BJP in Karnataka, here in Telangana we are also going to defeat BRS which is the B team of BJP.

Recently an opposition meeting was held in Delhi. We have made it clear that if BRS comes to that meeting, we will not attend the meeting. Congress doors are always open for leaders. Anyone who likes our ambitions and ideologies can come,” Rahul Gandhi clarified.

Related posts

కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ!

Drukpadam

కాంగ్రెస్ అడ్రెస్స్ గల్లంతేనా ? బీజేపీ దే హవా??… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

Drukpadam

ప్రభుత్వం మారితేనే తెలంగాణాలో ప్రజల బ్రతుకులు మారతాయి.షర్మిల ….

Drukpadam

Leave a Comment