- బీహార్ నవాడా జిల్లాలో వెలుగు చూసిన ఘటన
- ప్రియుడితో ఏకాంతంగా ఉండగా భర్త కుటుంబసభ్యులకు దొరికిపోయిన మహిళ
- అతడిని చితక్కొట్టి బందీగా చేసిన భర్త కుటుంబసభ్యులు
- విషయం తెలిసి భార్యను ప్రియుడికిచ్చి వివాహం జరిపించిన భర్త
లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్యను అతడికే ఇచ్చి పెళ్లిచేశాడో భర్త! బీహార్‌లోని నవాడా జిల్లాలో ఇటీవల వెలుగు చూసిందీ ఘటన. ఓ వివాహితకు కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అప్పటికే అతడికి పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ప్రియుడు ఎప్పటిలాగే ఆమెను కలిసేందుకు ఇటీవల ఓ రోజు రాత్రి ఇంటికి వెళ్లాడు. వాళిద్దరూ ఏకాంతంగా ఉండగా భర్త కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో, వారు ప్రియుడిని చితక్కొట్టి బందీగా చేసుకున్నారు. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు గ్రామం విడిచి వెళ్లాలని ఆదేశించారు.
ఈలోపు ఇంటికొచ్చిన భర్తకు విషయం తెలియడంతో అతడు తన భార్య, ఆమె ప్రియుడికి గుళ్లో పెళ్లి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రియుడు వివాహిత నుదుటిపై కుంకుమ పెట్టే సమయంలో ఆమె వలవలా ఏడ్చేసింది. కాగా, ఈ ఘటన గురించి తమకు తెలిసిందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ఈ విషయంలో ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.