సెన్సార్ బోర్డు మెంబర్ గా ఖమ్మం కు చెందిన సన్నే ఉదయ్ ప్రతాప్
కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డు మెంబర్ గా నియమితులైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ ప్రతాప్ నియమితులు అయ్యారు .ఈమేరకు ఆయనకు కేంద్ర ప్రభుత్వ ప్రచార సమాచార శాఖ సౌత్ ఇండియా సెన్సార్ బోర్డు మెంబర్ గా ఉత్తర్వులు అందాయి . కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు మెంబర్ కోసం గతంలో అనేక పైరవీలు ఉండేవి . ఉదయ ప్రతాప్ చిన్ననాటి నుంచి ఏబీవీపీ నగర కార్యదర్శి గా జిల్లా కార్యదర్శి గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా సేవలు అందించారు. ఏబీవీపీ కార్యకర్తగా నాయకుడిగా ఆయన పని చేశారు. బిజెపి నగర అధ్యక్షుడు గా అసెంబ్లీ కన్వీనర్ గా పార్లమెంట్ కన్వీనర్గా బిజెపి జిల్లా అధ్యక్షుడు నాలుగు సంవత్సరాలుపని చేసిన అనిభావం ఆయనకు ఉంది . వామపక్షాలకు దీటుగా ఖమ్మం జిల్లాలో పోరాటం చేయడంలో ఉదయ ప్రతాప్ అనేక సవాళ్ళను ఎదురుక్కొని నిలబడ్డారు . బిజెపిజిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిజెపిని ని బడుగు బలహీన వర్గాల అందర్నీ కలుపుకొని పోతూ వారితో మమేకమై పని చేసుకుంటూ బీజేపీని ని ముందుండి నడిపించారు. వీటన్నిటినిపరిగణలోకి తీసుకొని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బిజెపి పార్టీ సెన్సార్ బోర్డు నెంబర్ గా
ఉదయ ప్రతాప్ పేరు పంపించడం సిఫార్స్ చేయడం జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఉదయ ప్రతాప్ మాట్లాడుతూ నాకు నామినేటెడ్ పోస్టు రావడంలో ముఖ్య భూమిక పోషించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి మరియు రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాసరావు జిల్లా ఇంచార్జ్ యాదగిరి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు .