Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

తెలంగాణకు చెందిన ఆటిజం బాధితుడిపై మోదీ ప్రశంసల వర్షం…

..

తెలంగాణకు చెందిన ఆటిజం బాధితుడిపై మోదీ ప్రశంసల వర్షం…

  • వరంగల్ సభకు హాజరైన మోదీని కలిసిన కామిశెట్టి వెంకట్
  • నాటు నాటు పాట పడి, డ్యాన్స్ చేసిన వెంకట్
  • అతడి దృఢ సంకల్పానికి సెల్యూట్ అంటూ మోదీ ట్వీట్

తెలంగాణకు చెందిన ఆటిజం బాధితుడు కామిశెట్టి వెంకట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన  ప్రతిభ అసాధారణం, యువశక్తికి అతనో పవర్ హౌస్ అని కొనియాడారు. ఆటిజాన్ని అవరోధంగా భావించకుండా సింగింగ్, డ్యాన్స్ లో ప్రతిభ కనబరుస్తున్న ఆయన శనివారం వరంగల్ సభలో పాల్గొన్న ప్రధాని ఎదుట తన ప్రతిభను చాటుకున్నారు. ‘నాటు నాటు పాటకు నృత్యం చేశాడు. దాంతో,మోదీ వెంకట్ ప్రతిభను ప్రశంసించారు. ఆటిజాన్ని అవరోధంగా భావించకుండా గానం కొనసాగించాడన్నారు. నాటు నాటు పాడటమే కాకుండా నృత్యం కూడా చేశాడని పేర్కొన్నారు. అతడి దృఢ సంకల్పానికి సెల్యూట్ అంటూ ప్రధాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వెంకట్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను షేర్ చేశారు.

Related posts

దేశంలోనే అతి పొడవైన యూ-గర్డర్ బెంగళూరులో ఆవిష్కరణ!

Ram Narayana

బీజేపీకి వచ్చిన విరాళాలు రూ.10,122 కోట్లు.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు రూ.300 కోట్లకు పైగా!

Drukpadam

ఫ్రొఫెషనల్ బైక్ రేసర్ అవతారంలో రాహుల్ గాంధీ

Ram Narayana

Leave a Comment