Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కర్ణాటక లో దారుణం దళిత యువకుడికి మూత్రం తాగించిన ఎస్ ఐ….

కర్ణాటక లో దారుణం దళిత యువకుడికి మూత్రం తాగించిన ఎస్ ఐ….
-చిక్కమగళూరులో.. ఘటన
-మహిళకు ఫోన్ కాల్ వివాదంలో యువకుడికి చిత్రహింసలు
-బలవంతంగా మూత్రం తాగించిన ఎస్సై
-అట్రాసిటీ చట్టం కింద ఎస్సైపై ఎఫ్ఐఆర్ నమోదు
ఓ మహిళ ఫోన్‌కాల్‌కు సంబంధించిన వివాదంలో దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై అతడితో మూత్రం తాగించాడు. కర్ణాటకలోని చిక్కమగళూరులో జరిగిన ఈ ఘటనపై సర్వత్ర తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోనిబీదు ఎస్సై అర్జున్ పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా మూత్రం తాగించాడని బాధిత యువకుడు ఆరోపించాడు.దీనిపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫలితంగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది . ప్రభుత్వం పై వత్తిడి పెరిగింది.

ఎస్సై తీరుపై భగ్గుమన్న దళిత సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. యువకుడితో మూత్రం తాగించిన ఎస్సై అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదైందని, అట్రాసిటీ చట్టం కింద తప్పుగా నిర్బంధించడం, బెదిరింపు, అవమానానికి గురిచేయడం, హింసించడం వంటి అభియోగాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు తెలిపారు. అతడిని బదిలీ చేసినట్టు చెప్పారు.అయితే ఇది నిర్ధారణ కావాల్సి ఉంది.

Related posts

13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శారీరక బంధం.. పుట్టబోయే బిడ్డకు బాలుడే తండ్రన్న కోర్టు!

Drukpadam

నమ్మిన స్నేహితుడే పొడిచి చంపాడు …

Drukpadam

గూగుల్ మాతృసంస్థలో యువతులపై వేధింపులు…సుందర్ పిచాయ్ కి లేఖ

Drukpadam

Leave a Comment