Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఏపీలో పొత్తులపై జాతీయ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు: పురందేశ్వరి

  • ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు
  • బీజేపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయం
  • టీడీపీ కలుస్తుందా? అన్నదానిపై ఇంకా రాని స్పష్టత
  • సరైన సమయంలో పొత్తులపై ప్రకటన ఉంటుందన్న పురందేశ్వరి
  • జోనల్ సమావేశం కోసం నేడు ప్రొద్దుటూరు వచ్చిన పురందేశ్వరి

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ, జనసేన పార్టీలు తాము కలిసే ఉన్నామని పలు ప్రకటనల ద్వారా స్పష్టం చేస్తుండగా, ఇటీవల పవన్ కల్యాణ్ కు ఎన్డీఏ భేటీ కోసం ఆహ్వానం అందడం, ఆయన హాజరుకావడం… ఈ అంశాలతో ఆ రెండు పార్టీల భాగస్వామ్యానికి మరింత బలం చేకూరింది.

ఇక ఈ రెండు పార్టీలతో టీడీపీ జట్టు కడుతుందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. 

పొత్తులపై సరైన సమయంలో ప్రకటన ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న అంశం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయిస్తారని పురందేశ్వరి వెల్లడించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం తమకు శిరోధార్యమని పేర్కొన్నారు. 

రాయలసీమ ప్రాంతంలోని ఏడు జిల్లాల జోనల్ సమావేశం కోసం పురందేశ్వరి నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తదితరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురందేశ్వరికి ఇదే తొలి రాజకీయ పర్యటన.

Related posts

గదిలో పామును వదిలి.. భార్య, రెండేళ్ల కుమార్తెను చంపిన భర్త!

Ram Narayana

ఈ దొంగ రూటే సపరేటు …

Drukpadam

లాఖిమ్ పూర్ లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి వాహనం: వ‌రుణ్ గాంధీ!

Drukpadam

Leave a Comment