Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

సీఎం కెసిఆర్ జోలికొస్తే నీ నాలిక చీరేస్తాం..పొంగులేటిపై ఎమ్మెల్సీ మధు ఫైర్

సీఎం కెసిఆర్ జోలికొస్తే నీ నాలిక చీరేస్తాం..పొంగులేటిపై ఎమ్మెల్సీ మధు ఫైర్
అవాక్కులు చవాకులు పేలితే ..తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త …
అసెంబ్లీ ఎన్నికలతో నీ భవిష్యత్ కు చరమ గీతమే …
దళిత శాసనసభ్యుడి పై అహంకార పూరితంగా మాట్లాడతావా …

సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోరు ఉందికాదని అవాకులు చవాకులు పేలితే నాలుక చీరేస్తామని బీఆర్ యస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరించారు . మంగళవారం బీఆర్ యస్ ఖమ్మం జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనల్లో మాట్లాడుతున్న మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు . శ్రీనివాస్ రెడ్డి ధన బలం అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు . దళిత సామజిక వర్గానికి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటంపై ఫైర్ అయ్యారు . శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్ రానున్న ఎన్నికలతో ముగుస్తుందని మధు జోశ్యం చెప్పారు .

ఆర్థిక బల అహంకారంతో దళిత సామాజికవర్గ శాసనసభ్యులపై నీ ప్రతాపం చూపించాలనుకుంటున్నావా..? నీ ఆటలు సాగనివ్వమని అన్నారు .సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకట వీరయ్య గెలుపు ఖాయం.. ఆర్థిక ధన బలంతో విర్రవీగుతున్న శ్రీనివాస్ రెడ్డి తలకింద తపస్సు చేసిన ఖమ్మం జిల్లాలో రవ్వ గింజంత ప్రభావం కూడా ఉండదని తేల్చి పారేశారు . చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో రాజకీయ అజ్ఞానిగా శ్రీనివాస్ రెడ్డి మిగిలి పోవడం ఖాయమన్నారు .

వర్గ పోరుకు కేరాఫ్ అయిన ‌నీ చేరికతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని అన్నారు . ఆర్థిక, రాజకీయ ప్రయోజనం కొరకే శ్రీనివాస్ రెడ్డి ఉబలాటం అనే విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసున్నారు .. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకుని వెళ్తున్న మహానేత కేసిఆర్ పై నోరు ఉంది కదా అని ఎలా ?పడితే అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నాలుక చీరేస్తాం.. ఖబర్దార్ జాగ్రత్త అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుల నియోజకవర్గం వారిని ఓడించడమే లక్ష్యంగా ఒక పార్టీని వేదికగా చేసుకొని కుట్ర పన్నుతున్న విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అవగతం చేసుకున్నారని, రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో శ్రీనివాస్ రెడ్డి ఒక రాజకీయ అజ్ఞానిక మిగిలిపోవడం ఖాయమని తెలిపారు.

ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఖమ్మం జిల్లా ప్రజలు ఉన్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిచి, కేసీఆర్ ని మూడోసారి అధికారంలోకి తేవడం ఖాయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య , సీనియర్ నాయకులు మరియు ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ , బొమ్మెర రామ్మూర్తి , ఖమ్మం రూరల్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ బెల్లం వేణు , ఇల్లందు నియోజకవర్గ నాయకులు యలమద్ది రవి , లింగన్న సతీష్ మరియు పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారు … పి వై ఎల్ సభలో వక్తలు…

Drukpadam

జగన్ పై తనకు పూర్తీ విశ్వాసం …ఏ పని అప్పగించిన చేస్తా :సినీ నటుడు అలీ!

Drukpadam

వైసీపీ నేతలను మా మీదకు ఉసిగొల్పింది పోలీసులు కాదా?: ఆలపాటి రాజా!

Drukpadam

Leave a Comment