Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలువాతావరణం

దంచి కొడుతున్న వర్షాలు …పొంగిపొర్లుతున్న జలాశయాలు

-దంచి కొడుతున్న వర్షాలు …పొంగిపొర్లుతున్న జలాశయాలు
-ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి …ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
-హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రావాలి
-భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జీహెచ్ఎంసీ
-అత్యవసర పరిస్థితుల్లో 9000113667, 040-21111111 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచన
-ఐటీ ఉద్యోగుల లాగ్-ఔట్ వేళల మార్పు ఆగస్ట్ 1 వరకు పొడిగింపు
-విజయవాడలో కూలిన కొండచరియలు …గృహాలు ధ్వంసం తప్పిన ప్రాణాపాయం …

వర్షాలు దంచి కొడుతున్నాయి.సాధారణంగా మే చివర ,జూన్ నెలల్లో వర్షాలు లేకపోవడం జులై నెల మొదట్లో కూడా వాటి జాడ లేకపోవడంతో ఇక వర్షాలు రావేమో కరువు దిశగా వెళ్లుతున్నామా …? అని ఆందోళన చెందిన రైతులు ఒక్కసారిగా వర్షాలు రావడంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు . అయితే తొలకరి వర్షాలకు వేసిన పత్తి ఇతర పంటలకు ఈ వర్షాలు కొంత నష్టం తెస్తాయని అంటున్నారు .

రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడినం వలన ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వామ్మో ఇవిమీ వర్షాలు ,ఇవేమి వరదలు , ఇక చాల్లే అనే వరకు వెళ్లాయి. హైద్రాబాద్ లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు . ఐటీ ఉద్యోగులకు సైతం కంపెనీ లకు టైం అవుట్ ప్రకటించి ట్రాఫిక్ జాం లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేశారు .

హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ వాసులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు నగరంలో హైఅలర్ట్ జారీ చేసింది. నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఏదైనా అవసరమైతే 9000113667, 040-21111111 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. నగరవాసులకు ఎస్సెమ్మెస్ లు పంపించి జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా, మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు.

ఇదిలా ఉండగా, భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. లాగ్-ఔట్ ను మూడు ఫేజ్ లుగా విభజించింది. దీనిని తొలుత ఈ రోజు వరకు పరిమితం చేయగా, ఇప్పుడు ఆగస్ట్ 1 వరకు పొడిగించారు.

మూడు దశల్లో ఐటీ ఉద్యోగులు లాగ్-ఔట్ కావాలి. ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ కార్యాలయాలు సాయంత్రం మూడు గంటలకు, ఐకియా నుండి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉంటే కార్యాలయాలు సాయంత్రం గం.4.30కు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ కార్యాలయాల ఉద్యోగులు సాయంత్రం మూడు గంటలకు లాగ్ ఔట్ చేయాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లోని నదులు వాగులు ,వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ , మహబూబాబాద్ ,సూర్యాపేట ,నిజామాబాద్ ,ఆదిలాబాద్ ,జయశంకర్ భూపాలపల్లి ,ఖమ్మం ,సూర్యాపేట ,నల్లగొండ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. మహబూబాబాద్ ,ఖమ్మం జిల్లాలో ప్రవహిస్తున్న ఆకేరు నది పొంగిపొర్లుతోంది. సూర్యాపేట నల్లగొండ జిల్లాలో మూసి ప్రమాదకర స్థాయిలో ఉంది. ఏపీ ,తెలంగాణా మధ్య ఉన్న మున్నేరు నది ఉప్పొంగడంతో రెండు రాష్ట్రాల మధ్య లింగాల వద్ద రాకపోకలు నిలిచి పోయాయి.

కృష్ణ ,గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి గోదావరి నుంచి 16 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు .కాళేశ్వరం గేట్లు , ధవళేశ్వరం గేట్లు అన్ని ఎట్టి వేయడంతో అనేక మండలాల్లోని గ్రామాలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నీట మునిగింది. అధికార యంత్రాంగం మంత్రి పువ్వాడ నిరంతరం పర్వవేక్షిస్తున్నారు .

విజయవాడలో కొండలపై నివాసం ఉంటున్నవారు భయం బతుకులతో జీవనం వెళ్ళదీస్తున్నారు. కొండచరయ్లు కూలి నాలుగైదు గ్రహాలు ధ్వంసం అయ్యాయి. మరో రెండుమూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీచేశాయి.

Related posts

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి పవన్ కల్యాణ్ తప్పు చేశారు: చింతా మోహన్

Ram Narayana

రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి ‘పద్మ విభూషణ్’ అందుకోనున్న చిరంజీవి…

Ram Narayana

పోలింగ్ రోజున ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన…

Ram Narayana

Leave a Comment