Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం రూరల్ మండలం లో వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్సీ మధు ,ఎమ్మెల్యే కందాల

ఖమ్మం రూరల్ మండలం లో వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్సీ మధు ,ఎమ్మెల్యే కందాల
వరద భాదితులకు భరోసా …
పాల్గొన్న కలెక్టర్ , సీపీ వారియర్

ఖమ్మం రూరల్ మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ . సీపీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు .

ఖమ్మం రూరల్ మండలం మున్నేరు వరద ప్రభావిత కాలనీలలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముప్పు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తక్షణమే శానిటేషన్ పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుడద మయమైన కాలనీ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీపీ ఖమ్మం రూరల్ శ్రీమతి బెల్లం ఉమాదేవి, జడ్పిటిసి ఖమ్మం రూరల్ ప్రసాద్, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, ఖమ్మం రూరల్ తహసిల్దార్ శ్రీమతి సుమ, ఖమ్మం రూరల్ ఎంపీడీవో అశోక్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మద్దెల విజయ్, శ్రీను, రేపాకుల రవి, సాయి మోహన్, సతీష్ మరియు ఇతర కార్యకర్తలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో ….

టిటిడిసి నందు మున్నేరు వరద వరదల పై ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పి.వి గౌతమ్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పాల్గొన్నారు … ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
మున్నేరు వరద ముప్పు ప్రాంతాలలో ప్రాణం నష్టం కలగకుండా ప్రజాప్రతినిధులు , అధికారులు చేసిన కృషిని అభినందించారు ..

సిఎం కెసీఆర్ కేటీఆర్ , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులను తగిన ఆదేశాలు జారీచేయడం జరిగిందని అన్నారు. ఇంతవరకు మున్నేరు ప్రభావిత ప్రాంతాలలో ఇంత వరద ఎప్పుడు చూడలేదన్నారు .అధికారులు, ప్రజా ప్రతినిధులు వరద ఉధృతిని కూడా లెక్క చేయకుండా ప్రజలను అప్రమత్తం గావించిన తీరు ప్రశంశనీయమని అన్నారు .

తెల్లవారు 3 గంటల వరకు ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం పనిచేసిన విధానం అభినందనీయమన్న్నారు ..

రెస్క్యూ చేసే సమయంలో పలు ఇళ్ళ వారు సహకరించలేదు. అయినా విధిగా బాధ్యత నిర్వహించాం. ఇంతలా సమిష్టి కృషి చేసింది ఎప్పుడు లేదు. అందుకే ఒక్క ప్రాణం నష్టం కూడా జరగలేదన్నారు .సీఎం కెసిఆర్ సహాయంతో ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాన్ని సకాలంలో వినియోగించుకోగలిగాం..
పోలీస్ శాఖ పనితీరు హర్షణీయం పోలీసులు చిన్న పిల్లలను ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్మికులు, వైద్య శాఖ వారు చర్యలు చేపడతారు. జిల్లా ప్రజలు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
విపత్తులు, కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కృషిని కొనసాగిస్తాం అని తెలియజేశారు.

ఈ మీడియా సమావేశంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ జిల్లా ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వందే భారత్ రైలు ఖమ్మంలో ఆగుతుందా …?

Drukpadam

ఒక్క కేసుకు ఎంత‌మంది లాయ‌ర్ల‌ను ఎంగేజ్ చేస్తారు?సుప్రీంకోర్టు!

Drukpadam

లైవ్ టీవీలో రష్యాకు వ్యతిరేకంగా మహిళా ఉద్యోగి నిరసన.. 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం..

Drukpadam

Leave a Comment