Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ నేతల ముప్పేట దాడి…

మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం.. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

  • బీజేపీ అంటే ‘బాబు జనతా పార్టీ’ కాదన్న విజయసాయిరెడ్డి
  • బాబుది స్క్రిప్ట్‌.. వదినది డైలాగ్‌ అంటూ మండిపాటు
  • తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్లలో ఆనందమే టార్గెట్ అంటూ విమర్శలు

మీనాన్ననే మహానటులు అనుకున్నాం …మీరు అంతకంటే నటులు అనేది అర్ధం అయింది. వైసీపీ పై ప్రభుత్వంపై అక్కసుతో విమర్శలు చేసుతున్నారంటూ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు . మంత్రి రోజా మాట్లాడుతూ పురందేశ్వరి గారు మీరు బీజేపీకి అధ్యక్షుల,లేక టీడీపీకా అని అనుమానం వ్యక్తం చేశారు . మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ పాలన చూసి పురందేశ్వరి ఓర్వలేక పోతున్నారని నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు ..

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బీజేపీ అంటే ‘బాబు జనతా పార్టీ’ కాదంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ మాత్రమే మహానటులని అనుకున్నామని, ఆయన కూతురు పురందేశ్వరి కాదనుకున్నామని విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘అమ్మా పురందేశ్వరిగారు.. బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్‌.. వదినది డైలాగ్‌! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్లలో ఆనందమే టార్గెట్!” అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

‘‘మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు.. అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!” అంటూ మండిపడ్డారు. 2013లో పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించి పురందేశ్వరి గతంలో చేసిన ప్రకటనను షేర్ చేశారు.

Related posts

భద్రాచలంలో వరద భాదితుల ఆందోళన ..తమకు కరకట్ట నిర్మించాలని డిమాండ్!

Drukpadam

గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులు ఈటలను ఓడించగలరా ?బండి సంజ‌య్‌!

Drukpadam

బక్రీద్ ఎఫెక్ట్.. రూ. కోటి ధర పలికిన పొట్టేలు! కానీ..

Drukpadam

Leave a Comment