Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

రష్యా రాజధానిపై ఉక్రెయిన్ దాడి.. మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మూసివేత

  • మాస్కో పై మూడు డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్
  • డ్రోన్లను కూల్చి వేసిన రష్యా
  • డ్రోన్లు కూలడంతో దెబ్బతిన్న రెండు బిల్డింగులు

రష్యాకు ఉక్రెయిన్ మరోసారి షాకిచ్చింది. ఆ దేశ రాజధాని మాస్కోపై ఈ ఉదయం డ్రోన్లతో దాడి చేసింది. మూడు డ్రోన్లతో అటాక్ చేసింది. ఒక డ్రోన్ మాస్కో శివార్లలో పడింది. మరో రెండు డ్రోన్లను రష్యా సైన్యం కూల్చి వేసింది. అయితే కూల్చివేసిన ఈ డ్రోన్లు భవనాలపై పడ్డాయి. డ్రోన్ల వల్ల రెండు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల నేపథ్యలో మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి మాస్కో 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

మరోవైపు ఈ దాడులను ఉగ్రదాడులుగా రష్యా రక్షణ శాఖ అభివర్ణించింది. మాస్కో నగరంపై మానవరహిత వాహనాలతో ఉక్రెయిన్ టెర్రరిస్టు దాడులకు పాల్పడిందని చెప్పింది. ఒక డ్రోన్ ను మాస్కో శివార్లలో ధ్వంసం చేశామని… మరో రెండు డ్రోన్లను ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్ తో కూల్చి వేశామని, ఈ రెండు డ్రోన్లు నాన్ రెసిడెన్షియల్ బిల్డింగులపై పడ్డాయని తెలిపింది. 

ఈ దాడులపై రష్యా విదేశాంగ శాఖ స్పందిస్తూ… అమెరికా, దాని నాటో భాగస్వాముల సహకారం లేకుండా ఉక్రెయిన్ ఈ దాడులు చేయలేదని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా మాస్కో సిటీ మేయర్ మాట్లాడుతూ… రెండు బిల్డింగులు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.

Related posts

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుపై మరోసారి స్పందించిన అమెరికా

Ram Narayana

భర్తలు తమ భార్యలను ఎల్లప్పుడూ మత్తులో ఉంచాలన్న బ్రిటన్ మంత్రి

Ram Narayana

కిర్గిస్థాన్‌లోని భార‌త విద్యార్థులు బ‌య‌ట‌కు రావొద్దు: కేంద్రం

Ram Narayana

Leave a Comment