Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మాజీ మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరదలు కృష్ణప్రియ!

  • హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కృష్ణప్రియ ఫిర్యాదు
  • తన బావ నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం వేధిస్తున్నారన్న కృష్ణప్రియ
  • నారాయణపై కేసు నమోదు చేసిన పోలీసులు? 

మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు కృష్ణప్రియ చేసిన తీవ్ర ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. తన భార్యకు మానసిక ఆరోగ్యం బాగాలేదని, ఆమె వీడియోలను పట్టించుకోవద్దని నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. కానీ తాజాగా కృష్ణప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చర్చనీయాంశమవుతోంది.

ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కృష్ణప్రియ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఆమె ఫిర్యాదును అందజేశారు. తన బావ నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీంతో నారాయణపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. తాను మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్నానని తన భర్త చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది.

 నా భార్య మానసిక ఆరోగ్యం బాగాలేదు… ఆ వీడియోలను ఎవరూ పట్టించుకోవద్దు: నారాయణ సోదరుడి విజ్ఞప్తి

  • తన భార్య మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్నారన్న సుబ్రహ్మణ్యం
  • ఆమెకు క్యాన్సర్‌‌ ఉన్నట్లు గత మే నెలలో డాక్టర్లు చెప్పారని వెల్లడి
  • కీమోథెరపీ కొనసాగుతోందని, ఆమె వ్యాఖ్యలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి
Ex Minister Narayana Brother subrahmanyam Shocking Comments on his wife

మాజీ మంత్రి నారాయణ తనను తీవ్రంగా వేధించారంటూ ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దుమారం రేపిన ఈ వ్యవహారంపై నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్పందించారు. తన భార్య ఆరోగ్యం బాగాలేదని, ఆమె వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కోరారు.

తన భార్య కొన్ని రోజులుగా మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్నారని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆమె కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారని చెప్పారు. అవి తమ కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. పలువురు సైకియాట్రిస్టులకు చూపించామని, అయినా ఆమె పరిస్థితి మెరుగు కాలేదని అన్నారు. 

కృష్ణప్రియకు క్యాన్సర్‌‌ ఉన్నట్లు గత మే నెలలో డాక్టర్లు చెప్పారని సుబ్రహ్మణ్యం వివరించారు. యశోద ఆసుపత్రిలో తన భార్యకు సర్జరీ చేసినట్లు చెప్పారు. 8 సార్లు కీమోథెరపీ చేయించాలని చెప్పారని, ఇప్పటికి రెండు సార్లు చేయించామని తెలిపారు.

తన భార్యకు ఇంకా చికిత్స కొనసాగుతోందని ఆయన చెప్పారు. ట్రీట్‌మెంట్ ఇప్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే క్యాన్సర్‌‌కు చికిత్స కారణంగా సైకియాట్రిస్టు మందులను నిలిపివేశారని వివరించారు. మానవతా దృక్పథంతో ఆ వీడియోలను ఎవరూ పట్టించుకోవద్దని సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.

Related posts

హర్యానాలో హింస.. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో నలుగురి మృతి!

Ram Narayana

మద్యం మత్తులో నిజం కక్కేసి.. కటకటాలపాలైన హంతకుడు…!

Drukpadam

లక్ష్యం పోలీసులు ….పేలిన సామాన్యుల వాహనం ఛత్తీస్ ఘడ్ లో ఘటన

Drukpadam

Leave a Comment