Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు

పవన్ కల్యాణ్ కు ఓటేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడంలేదు: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

  • వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు
  • పవన్ ఎన్ని పర్యటనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదన్న సిద్ధార్థ్ రెడ్డి
  • అందుకే పవన్ వివాదాలు రేకెత్తిస్తున్నారని విమర్శలు
  • గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీత

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. వాలంటీర్ల వల్ల రాష్ట్ర ప్రజలకు చెందిన కీలక వివరాలు దుర్వినియోగం అవుతున్నాయన్న పవన్ ఆరోపణలను ఖండించారు. 

ఏపీలో ఎన్ని పర్యటనలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పవన్ వివాదాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విమర్శించారు. రూ.5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 

అసలు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని, ఆయనకు ఓటేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడం లేదని సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. ఏపీలో టీడీపీ పనైపోయిందని, అలాంటి పార్టీతో పొత్తులకు పవన్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

Related posts

ట్రాక్టర్‌పై ఎంట్రీ ఇచ్చిన వధువు.. పెళ్లి కొడుకు షాక్!

Drukpadam

కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …!

Drukpadam

ఆరుగురు తృణమూల్​ ఎంపీలను బహిష్కరించిన రాజ్యసభ!

Drukpadam

Leave a Comment