Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి… 44 మంది మృతి

  • ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లో ఘటన
  • ఓ మతపరమైన సమ్మేళనంలో తనను తాను పేల్చుకున్న వ్యక్తి
  • తెగిపడిన అవయవాలతో బీభత్సంగా ఘటన స్థలం
  • 200 మంది వరకు గాయపడినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం

వాయవ్య పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందగా, 200 మంది వరకు మరణించారు.

ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోని బజౌర్స్ ఖర్ పట్టణంలో జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్-ఫజల్ సంస్థకు చెందిన మతపరమైన సమ్మేళనం జరుగుతుండగా, ఓ వ్యక్తి తనను తాను పేల్చివేసుకున్నాడు. పేలుడు ధాటికి తీవ్ర విధ్వంసం నెలకొంది. శరీరాలు ఛిద్రమైపోయాయి. ఘటన స్థలంలో భీతావహ దృశ్యాలు కనిపించాయి.

సాయంత్రం 4 గంటలకు ఈ పేలుడు సంభవించిందని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని, తేరుకుని చూశాక పొగ, దుమ్ము, ధూళి కమ్మేసిందని, తెగిపడిన అవయవాలతో ఆ ప్రదేశమంతా బీభత్సంగా మారిందని ఆదామ్ ఖాన్ అనే బాధితుడు వెల్లడించారు.

కాగా, ఈ ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరపాలని జమియత్ ఉలేమా సంస్థ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రహ్మాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సీఎం అజామ్ ఖాన్ లను డిమాండ్ చేశారు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు…

Drukpadam

నచ్చిన చోట నుంచే పని ..ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ….

Drukpadam

ఉమ్మడి జిల్లాలోని పోలీస్ కేడర్‌ సర్దుబాటు ప్రక్రియను పారదర్శకం: విష్ణు ఎస్ వారియర్!

Drukpadam

Leave a Comment