Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై వాహనాల వేగం మళ్లీ పెంపు

  • గతంలో ఓఆర్ఆర్ పై 120 కి.మీ వేగ పరిమితి
  • వరుస ప్రమాదాలతో 100 కి.మీకి తగ్గించిన వైనం
  • ఇటీవల భద్రతా పరమైన చర్యలు తీసుకున్న అధికారులు
  • ఓఆర్ఆర్ పై లైటింగ్ వ్యవస్థ మెరుగుపర్చిన వైనం
  • ఇతర భద్రతా ప్రమాణాల అమలు
  • తిరిగి 120 కి.మీ వేగ పరిమితితో నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్ అవుట్ రింగ్ రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని మళ్లీ 120 కి.మీకి పెంచారు. గతంలో ఓఆర్ఆర్ పై వాహన ప్రమాదాలు అధికం కావడంతో వేగ పరిమితిని 120 కి.మీ నుంచి 100 కి.మీకి తగ్గించారు. అప్పటినుంచి ప్రయాణికుల భద్రత కోసం ఓఆర్ఆర్ పై అనేక చర్యలు తీసుకున్నారు. లైటింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచారు. రహదారి భద్రత ప్రమాణాలను అమలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, తాజాగా వాహనాల వేగం పెంపు నిర్ణయం తీసుకున్నారు. వేగ పరిమితిని 100 కి.మీ నుంచి 120 కి.మీ వేగం పెంచుతున్నట్టు నోటిఫికేషన్ జారీ చేశారు. పోలీసులతో మంత్రి కేటీఆర్ సమావేశమై విధివిధానాలపై చర్చించిన అనంతరం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.

వేగ పరిమితి వివరాలు…

  • 1, 2వ లేన్లలో గరిష్ఠ వేగం 120 కి.మీ
  • భారీ వాహనాలు ప్రయాణించే 3, 4 లేన్లలో గరిష్ఠ వేగం 80 కి.మీ
  • ఓఆర్ఆర్ పై కనీస వేగ పరిమితి 40 కి.మీ
  • ఓఆర్ఆర్ పై పికప్ లు, డ్రాపింగ్ లు, పార్కింగ్ చేస్తే చర్యలు

Related posts

అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు అధికారులు …

Ram Narayana

వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి సీఎం రేవంత్ ఆహ్వానం

Ram Narayana

కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు… ఆహ్వాన లేఖతో పాటు రేవంత్ రెడ్డి రాసిన లేఖ అందజేత…

Ram Narayana

Leave a Comment