ఎ.బి.సి.డి వర్గీకరణపై మందకృష్ణ కు మాట ఇచ్చిన ప్రధాని మోడీ …
కిషన్ రెడ్డి సమక్షంలో ప్రధానిని కలిసిన మంద కృష్ణ మాదిగ
2024 నాటికీ వర్గీకరణ బిల్లు పెట్టె యోచనలో బీజేపీ
అదే జరిగితే మాదిగల ఓట్లు బీజేపీకి గంప గుత్తగా పడతాయని ఆశ
మరి మాలలను ఒప్పించేది ఎలా అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు
ఎస్సీ రిజర్వేషన్లలో ఎక్కువగా ఉన్న తమ మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని , మాదిగలకు రిజర్వేషన్ లకు ఎ.బి.సి.డి వర్గీకరణ కల్పించాలని మూడు దశాబ్దాలుగా మంద కృష్ణ మాదిగ ఆధ్వరంలో అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. నాటి నుంచి మాదిగలు రిజర్వేషన్ల కోసం కలవని పార్టీ ఎక్కని మెట్టు ,తొక్కని గడపలేదు . అనేక ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ అవి హామీలుగానే మిగిలాయి. పల్లె నుంచి పట్నం దాక …గల్లీ నుంచి ఢిల్లీ దాక మంద కృష మాదిగ ఉద్యమాలను పరుగులు పెట్టించారు . ఎస్సీలలో వెనకబడిన మాదిగలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో చేస్తున్న ఆయన ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో ఉవ్వెత్తున లేచింది . లక్షలాది మందిని సమీకరించి సభలు పెట్టారు .సమావేశాలు నిర్వహించారు .తాను పుట్టినజాతి మనుగడ కోసం పరితపిస్తున్నారు…అందులో భాగంగానే ఆయన లెఫ్ట్, రైట్ అనే తేడా లేకుండా తమకు ఏ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందని అనుకుంటే వరిదగ్గరకు పరుగులు తీశారు .తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అందుకు కాలుకు బలపం కట్టుకొని తిరిగారు .
ఆయన తన జాతి భవితవ్యం కోసం చేస్తున్న ఉద్యమంలో న్యాయాన్యాలు పక్కనపెడితే చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు …చివరకు భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తెలుగుజాతి ముద్దు బిడ్డ ఎం వెంకయ్య నాయుడు సైతం మంద కృష్ణ మాదిగ డిమాండ్ న్యాయమైనదని అందుకు తనకున్న అధికారాలను ఉపయోగించి మాదిగలకు రిజర్వేషలు అములు జరిగేలా భారత ప్రభుత్వాన్ని ఒప్పించేలా కృషి చేశారు . అయితే ఎక్కడో అది తేడా కొట్టింది. తర్వాత బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంద కృష్ణ మాదిగ రిజర్వేషల ఉద్యమాన్ని సానుకూలంగా అర్ధం చేసుకొని అండగా ఉంటానని హామీ ఇచ్చారు . ఇప్పడు ఆయన కేంద్రమంత్రిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమించబడ్డారు . బీజేపీ తెలంగాణ లో అధికారంలోకి రావాలంటే ఇక్కడ మాలలకన్నా అధికంగా ఉన్న మాదిగల ఓట్లు కీలకంగా మారాయి.
దీంతో ఆయన ఇటీవల వరంగల్ బహిరంసభ కు వచ్చిన ప్రధాని మోడీతో మంద కృష్ణ మాదిగకు ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇపిన్చడమే కాకుండా మాదిగల రిజర్వేషన్ల సమస్య పరిష్కరిస్తే తెలంగాణాలో వారి ఓట్లు గంప గుత్తగా తమకు పడే అవకాశం ఉందని భావించి అందుకు అనుగుణంగా ఆలోచనలు చేస్తామని కిషన్ రెడ్డి సమక్షంలో ప్రధాని మోడీ ,మంద కృష్ణ మాదిగకు స్పష్టమైన హామీ ఇచ్చారని మంద కృష్ణ ఒక సమావేశంలో వెల్లడించారు . చూద్దాం మూడు దశాబ్దాల ఉద్యమానికి ముగింపు పలుకుతుందో లేదో మరి …!