Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

 మంత్రి పెద్దిరెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన రామచంద్రయాదవ్

  • పెద్దిరెడ్డి రూ.35వేల కోట్లు దోచుకున్నారని ఆరోపణ
  • అమిత్ షాకు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
  • ఆస్తుల వివరాలు వెల్లడించకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపణ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ మంగళవారం ఆరోపించారు. ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పెద్దిరెడ్డి రూ.35వేల కోట్లు దోచుకున్నారన్నారు. అమిత్ షాను కలిసి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పెద్దిరెడ్డి అవినీతిపై ఈడీతో దర్యాఫ్తు చేయించాలని కోరినట్లు తెలిపారు. పెద్దిరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

2019కి ముందు తన కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించకుండా ఎన్నికల సంఘాన్ని పెద్దిరెడ్డి తప్పుదారి పట్టించారన్నారు. ప్రభుత్వం నుండి అక్రమంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకొని ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. పదిహేడు మంది బినామీ డైరెక్టర్ల ద్వారా 60కి పైగా సూట్ కేసు కంపెనీలను సృష్టించారని ఆరోపించారు. గత నాలుగేళ్ల కాలంలోనే కంపెనీ ఆదాయం కొన్ని వందల రెట్లు చూపించారన్నారు.

Related posts

The 5 Best Curling Irons For Beginners, According To A Stylist

Drukpadam

గ్రానైట్ పరిశ్రమ తనకు కన్నతల్లి లాంటిది .. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర!

Drukpadam

తెలంగాణ ఆదాయం దూసుకుపోతుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు!

Drukpadam

Leave a Comment