Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం జిల్లాలో మధ్య షాప్ ల లక్కీ డ్రా తీసి రిజర్వేషన్ల ఖరారు చేసిన కలెక్టర్ కలెక్టర్ గౌతమ్ …

షాప్ ల రిజర్వేషన్ల ఖరారు చేసిన కలెక్టర్
ఖమ్మం జిల్లాలో మొత్తం 122 షాపులు అందులో 40 రిజర్వేషన్లు
గౌడ కులానికి 18 షాపులు ..ఎస్సీ లకు 14 ,ఎస్టీలకు 8 షాపుల కేటాయింపు
గౌడ కులస్తులకు 4, 116, 101, 18, 66, 2, 77, 94, 17, 62, 110, 41, 109, 114, 67, 92, 7, 1 నెంబర్ల షాపులు
, ఎస్సిలకు 25, 34, 49, 71, 24, 97, 13, 82, 87, 78, 99, 26, 111, 86 నెంబర్ల షాపులు
117, 118, 119, 120, 121, 122 .12 ,21 షాపులు

2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం రిజర్వేషన్ లను లక్కీ డ్రా ద్వారా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. ఖరారు చేశారు. గురువారం డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారులు, ఎస్సి, ఎస్టీ, బిసి సంక్షేమ త్రిసభ్య కమిటీ అధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్ లక్కీ డ్రా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 122 మద్యం దుకాణాలకు గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు 40 మద్యం దుకాణాల రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు తెలిపారు. ఇందులో గౌడ కులానికి 18 (15 శాతం), ఎస్సీలకు 14 (10 శాతం), ఎస్టీ లకు 8 (5 శాతం) మద్యం దుకాణాల్లో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 6 దుకాణాలు పోనూ మిగతా 2 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామన్నారు. 70 శాతం అనగా 82 మద్యం దుకాణాలు జనరల్ కు కేటాయించామని ఆయన తెలిపారు. లక్కీ డ్రా ద్వారా గౌడ కులస్తులకు 4, 116, 101, 18, 66, 2, 77, 94, 17, 62, 110, 41, 109, 114, 67, 92, 7, 1 నెంబర్ దుకాణాలు, ఎస్సిలకు 25, 34, 49, 71, 24, 97, 13, 82, 87, 78, 99, 26, 111, 86 నెంబర్ దుకాణాలు, ఎస్టీ లకు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే 6 దుకాణాలు 117, 118, 119, 120, 121, 122 నెంబర్ వి రిజర్వ్ ఉండగా, గురువారం లక్కీ డ్రా ద్వారా 12, 21 నెంబర్ దుకాణాలు కేటాయింపబడ్డాయని ఆయన అన్నారు. నేడు (శుక్రవారం) నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరిస్తామని ఈ నెల 18 సాయంత్రం 6.00 గంటల వరకు అన్ని పనిదినాలలో దరఖాస్తులను స్వీకరణ చేపడతామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా ఆబ్కారీ పర్యవేక్షకులు నాగేంద్ర రెడ్డి, డిడి సాంఘీక సంక్షేమం కె. సత్యనారాయణ, డిడి గిరిజన సంక్షేమం కృష్ణా నాయక్, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి. వేణుగోపాల్ రెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వి. రాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి

Ram Narayana

తన గెలుపును ఎవరు ఆపలేరు … పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి!

Ram Narayana

నేను చీటర్ ను కాదు …ఫైటర్ ను …ఖమ్మం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పువ్వాడ..

Ram Narayana

Leave a Comment