Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి … స్పీకర్ కు అధిర్ రంజాన్ చౌదరి విజ్ఞప్తి ..

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి … స్పీకర్ కు అధిర్ రంజాన్ చౌదరి విజ్ఞప్తి ..
కాంగ్రెస్ సభ్యుల హర్షతిరేకాలు…
న్యాయం గెలిచిందన్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే
మూడు అంశాలు దాచడం ఎవరికీ సాధ్యం కాదు …
సూర్యుడిని , చంద్రుడిని , నిజాన్ని ఎవరు దాచలేరన్న ప్రియాంక గాంధీ

మోడీలు దొంగలు అంటూ చేసిన కామెంట్ నేపథ్యంలో రెండు సంవత్సరాలు శిక్ష విధించిన గుజరాత్ సెషన్ కోర్ట్ ..దీంతో వెంటనే ఆయన లోకసభ్యుడిగా ఉన్న రాహుల్ సభ్యత్వాన్ని ఆఘమేఘాల మీద స్పీకర్ ఓం బిర్లా రద్దు చేశారు . ఫలితంగా నాటి నుంచి రాహుల్ గాంధీ న్యాయపోరాటం చేస్తున్నారు. గుజరాత్ హైకోర్టు లో స్టే కోసం ప్రయత్నించారు . అయినప్పటికీ హైకోర్టు కింది కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. దీంతో రాహుల్ సుప్రీం కు వెళ్లారు . కేసు విచారించిన ముగ్గురు సభ్యులు గల సుప్రీం ధర్మాసనం రాహుల్ గాంధీకి విధించిన రెండు సంవత్సరాల శిక్ష పై స్టే విధించింది. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కాంగ్రెస్ పక్షం కోరింది. లోకసభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ నాయకుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలి డిమాండ్ చేశారు . మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానంపై రాహుల్ ప్రసంగించాల్సి ఉందని చౌదరి స్పీకర్ కు గుర్తు చేశారు . దీనిపై చర్యలు తీసుకుంటానని స్పీకర్ చెప్పారని చౌదరి తెలిపారు .

నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది…మల్లిఖార్జున ఖర్గే …

రాహుల్ గాంధీ బెంగుళూరు మోడీ ఇంటిపేర్లు కలిగిన వాళ్లంతా దొంగలని అన్నారని అది మోడీ పేరున్న వాళ్ళందరిని హార్ట్ చేసిందని గుజరాత్ కు చెందిన సంపూర్ణేష్ మోడీ అనే వ్యక్తి సూరత్ కోర్ట్ లో పిటిషన్ వేశారు .దీనిపై విచారణ జరిపిన కోర్ట్ రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాలు శిక్ష విధించింది. చట్టసభల్లో సభ్యులకు రెండు సంవత్సరాలు శిక్ష పడితే ఆటోమేటిక్ గా ఆసభ్యుడి సభ్యత్వం రద్దు అవుతుంది… దీంతో రాహుల్ సభ్యత్వం రద్దు అయినట్లు స్పీకర్ ప్రకటించారు . సుప్రీం దీనిపై స్టే విధించింది. దీంతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడతూ నిజం ఎప్పటికైనా విజయం సాదిస్తుందని సుప్రీం తీర్పు ద్వారా విదితం అయిందని అన్నారు . కాంగ్రెస్ సభ్యులు కోర్ట్ తీర్పు పై హర్షం ప్రకటించారు .

మూడు అంశాలను దాచడం సాధ్యం కాదు …ప్రియాంక గాంధీ

రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్ట్ విధించిన శిక్షపై సుప్రీం స్టే ఇవ్వడంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పందించారు . సూర్యుడిని , చంద్రుడిని ,నిజాన్ని దాచడం ఎంతోకాలం సాధ్యం కాదని అందువల్లనే గౌతమ బుద్ధుడు సత్యమేవ జయతే అన్నారని ఈసందర్భంగా గుర్తు చేశారు…

కేసును విచారించిన త్రీసభ్య ధర్మాసనం ….

జస్టిస్‌లు బిఆర్‌ గవాయ్‌, పిఎస్‌ నరసింహ, సంజయ్‌ కుమార్‌లతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం గుజరాత్‌ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. రాహుల్ తరుపున అభిషేక్ మాన్ సింగ్వి వాదనలు వినిపించగా ,సంపూర్ణేష్ తరుపున జఠ్మలానీ వాదనలు వినిపించారు . ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం రాహుల్ తీర్పు పై స్టే విధించింది…

ప్రత్యేకించి నేరం గుర్తించదగినది కాని, బెయిలబుల్ మరియు కాంపౌండ్ చేయదగినది అయినప్పుడు, న్యాయనిర్ణేత న్యాయమూర్తి నుండి ఆశించిన అతి తక్కువ విషయం ఏమిటంటే రియాలిటీ ఇవ్వడమే

సెక్షన్ 8(3) యొక్క విస్తృత శాఖలను పరిగణనలోకి తీసుకుంటే, పిటిషనర్ యొక్క హక్కును మాత్రమే కాకుండా, ఎన్నికలను నిర్వహించే ఓటర్ల హక్కులను కూడా ప్రభావితం చేస్తుందని రాహుల్ న్యాయవాది వాదనలతో కోర్ట్ ఏకీభవించింది…. ఇది హత్య నేరం కాదని , దొంగతనం కాదని ఈకేసులో కింది కోర్ట్ ఆ సెక్షన్ కింద ఉన్న రెండు సంవత్సరాల కాలాన్ని ఉపయోగించుకున్నారని రాహుల్ న్యాయవాది కోర్ట్ దృష్టికి తెచ్చారు .పైగా కేసు వేసిన వ్యక్తి మోడీ కాదని కొత్తగా తనపేరు మోడీగా పెట్టుకున్నారని కోర్ట్ కు తెలిపారు .మొత్తం కేసును స్టడీ చేసిన ధర్మాసనం రాహుల్ గాంధీకి స్టే ఇస్తూ తీర్పు ఇచ్చింది….

Related posts

గుజరాత్ సీఎం రేసులో ముందున్నప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దు ?

Drukpadam

వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్ ప్రశ్న.. దీటుగా స్పందించిన స్మృతి ఇరానీ

Ram Narayana

సాగర్ లో పోటీకి విజయశాంతి సై అంటారా ?

Drukpadam

Leave a Comment