- అవినీతి కేసులో ఇమ్రాన్ కు జైలు శిక్ష విధించిన ఇస్లామాబాద్ కోర్టు
- రూ. లక్ష జరిమానా విధించిన కోర్టు
- కోర్టు తీర్పు వెంటనే ఇమ్రాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ లోని ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది. ఆయనపై ఐదేళ్ల పాటు అనర్హత వేటు వేసింది. దీతో ఆయన ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అవినీతి కేసులో ఈ మేరకు కోర్టు శిక్షను విధించింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన విలువైన బహుమతులను అమ్ముకున్నారనే కేసులో (తోషాఖానా కేసు) ఆయనకు కోర్టు శిక్షను విధించింది. ఇమ్రాన్ ఖాన్ పై మే 10న పాకిస్థాన్ ఎలెక్షన్ కమిషన్ క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేసింది.