బీజేపీలో చేరను తటస్తంగానే ఉంటా – ఈటల రాజేందర్….
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేస్తా
బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
రాజీనామాపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తా
బీజేపీ మద్దతు కోసమే నేతలను కలిశాను
తాను బీజేపీలో చేరానని ,తటస్తంగానే ఉంటానని మాజీమంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీజేపీ లో చేరుతున్నట్లు వస్తున్నా వార్తలపై ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆయన మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతలను కలిసిన మాట వాస్తవమేనన్నారు. వారిమద్దతుకోసమే కలిశానని వివరించారు. ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేరాలని బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతలతో ఈటల రహస్యంగా సమావేశం కూడా అయ్యారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఈటల రాజేందర్ తాజాగా స్పందించారు. ఆయన ఇప్పటికే వివిధ పార్టీల నేతలను కలిశారు. మరింతమందిని కలిసేందుకు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే తాను బీజేపీ నేతలను కలిశానన్నారు. అన్నిపార్టీల వారు తనకు మద్దతుగా నిలిచారని అందువల్ల ఒక పార్టీలో చేరానని అన్నారు . త్వరలోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎప్పుడు చేసింది మాత్రం తెలపలేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఈటల రాజినామా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆయన్ను ఓడించాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.కాబినెట్ లో సీనియర్ మంత్రి ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ను హుజురాబాద్ కు ఇంచార్జి గా నియమించారు. అంతకుముందు జిల్లాలకు చెందిని మంత్రి గంగులకు హుజురాబాద్ ఆపరేషన్ భాద్యతలు ఒప్పగించినప్పటికీ అనుకూల ఫలితాలు రాకపోవడం ,పైగా ఈటల గంగుల మీద ఘాటుగా ఫైర్ అవ్వడం తో దానికి దీటుగా గంగుల జవాబు ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో హరీష్ రావు అంతకు ముందు ప్రగతి భవన్ కేంద్రంగా ఆపరేషన్ మొదలు పెట్టారని వార్తలు వచ్చాయి. ఈటల ,హరీష్ రావు లు ప్రభుత్వం పట్ల , కేసీఆర్ పట్ల ఒకేరకమైన మైండ్ సెట్ కలిగిఉన్నారని అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో హుజురాబాద్ ఆపరేషన్ అప్పగించటం ద్వారా ఇద్దరిమధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడుతుందని కేసీ భాహించినందునే హరీష్ రావు ను ప్రత్యేకంగా హుజురాబాద్ లో నియమించారని బలమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టీఆర్ యస్ పెద్ద ఎత్తున ఆపరేషన్ స్టార్ట్ చేసినందున ఈటల తన ప్రయత్నాల్లో తాను ఉన్నాడు . అందులో భాగంగానే మద్దతు కోరేందుకే బీజేపీ నేతలను కలిశాడని తెలుస్తుంది.తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవమని చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ హుజూరాబాద్ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారికంగా తన నిర్ణయం ప్రకటిస్తానని కూడా ఈటల స్పష్టం చేశారు. అందువల్ల ఈటల బీజేపీ లో చేరుతున్నట్లు వస్తున్నా వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్లే ….. చూద్దామా ఏమిజరుగుతుందో …….
previous post
next post