మాయల పకీరు మాటలు నమ్మొదు
- వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం
- పదికి పది సీట్లు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
- తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- సీఎం కేసీఆర్ మాయల పకీరు అని ఆయన మాటలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మడం లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ను ఫాం హౌస్‌కే పరిమితం చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్ని పథకాలు ఇచ్చిన ఓటమి తప్పదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రూరల్ మండలం సత్యనారయణపురంలోని టీ సీ వీ రెడ్డి ఫంక్షన్హల్లో జరిగిన కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం లోని బీ ఆర్ ఎస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు , కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి పార్టీ కుండువాలు కప్పి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభ ను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ… తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, దాని వలన లబ్ధిపొందింది కేసీఆర్ ఫ్యామీలి అన్నారు. ఇతర దేశాల్లో విపరీతంగా నల్లదనం దాచుకున్న చరిత్ర కేసీఆర్ ఫ్యామీలికి ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖమ్మంలో జరిగిన రాహూల్‌గాంధీ సభకు అత్యధికంగా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు వచ్చి విజయవంతం చేశారన్నారు. పాలేరు కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అన్నారు. జిల్లాలో గ్రూపులకతీతంగా ప్రతి కార్యకర్త పనిచేసి విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. హస్తం గుర్తు పేదలకు సంక్షేమాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలన్న, రాజన్న పాలన రావాలన్న కాంగ్రెస్ అ ధికారంలోకి వస్తేనే సాధ్యమౌతుందన్నారు. పదికి పది సీట్లు సాధించి రాష్ట్ర పార్టీకి బహుమతిగా ఇవ్వాలన్నారు.
- రాబోవు రోజుల్లో తాను, భట్టివిక్రమార్క, రేణుకాచౌదరి, సంభాని , ఇతర సీనియర్ నేతలమంతా ఒకే వేదిక నుంచి కార్యకర్తలకు సలహాలు, సూచనలు చేస్తామని అన్నారు. తమ పార్టీ అభ్యర్థులెవరైన అంతీమంగా గెలుపుకోసమే పనిచేయాలన్నారు. కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలుపుకుని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, రామ సహాయం నరేష్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, మువ్వా విజయబాబు, తుళ్ళూరి బ్రహ్మయ్య, రామ సహాయం మాధవి రెడ్డి , పాలేరు నియోజక వర్గ నాయకులు చావా శివ రామకృష్ణ , టీపీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వర రావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి చరణ్ రెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, బెల్లం శ్రీను, హరినాధ్‌బాబు, కొప్పుల అశోక్, కన్నేటి వెంకన్న, కళ్లెం వెంకట రెడ్డి, మద్ది కిషోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్ , కొప్పుల చంద్రశేఖర్, మట్టే గురవయ్య తదితరులు ఉన్నారు.