Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలురాజకీయ వార్తలు

పొంగులేటి పోటీపై డైలమా …?అసెంబ్లీకా …పార్లమెంట్ కా.…?

జిల్లా కాంగ్రెస్ లో పొంగులేటి ఐక్యత సాధిస్తారా….?
గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ లో ఇది సాధ్యమేనా …??
ఆయన వెంట వచ్చినవారిలో ఎందరికి సీట్లు ఇప్పిస్తారు
ఆయన ఎక్కడ నుంచి పోటీచేస్తారు …క్లారిటీతో ఉన్నారా …
అందరిని ఒక్కతాటిపై తెస్తారా ….?

ఖమ్మం మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ కో- కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు … అన్ని నియోజకవర్గాలను చుట్టివేస్తున్నారు …ఉమ్మడి జిల్లాలో గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ లో ఐక్యత సాధిస్తానని అంటున్నారు …? ఇది సాధ్యమైయ్యే పనేనా ..? అంటే ప్రస్నార్ధకమే అంటున్నారు పరిశీలకులు … భట్టి ,రేణుక చౌదరి , సంభాని అందరం కలిసి కట్టుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని అంటున్నారు .కానీ ఆయన పర్యటనల్లో మిగతా గ్రూప్ లవారికి ప్రాధాన్యత లేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ని అధికారంలోకి తెలవాలనే పట్టుదలతో ఉన్న పొంగులేటి గ్రూపుల మధ్య ఐక్యత తీసుకోని రావడంపైనే జిల్లాలో ఫలితాలు ఉంటాయనేది నిర్వివాదాంశం … అందుకు అన్ని గ్రూపులను ఆయన ఒప్పించి మెప్పించగలగాలి … ఇప్పటికే భట్టి , రేణుక వర్గాలు ఉత్తర దక్షణ దృవాలుగా ఉన్నాయి.. అయితే కొన్ని చోట్ల పొంగులేటి పర్యటనల్లో రెండు గ్రూప్ లు పాల్గొంటున్నాయి. అయితే ఎవరికీ వారే ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు .

జిల్లాలో 10 సీట్లలో సర్వేల ఆధారంగా సీట్లు ఇస్తామని అంటున్నారు …నిజంగా కాంగ్రెస్ అదిజరుగుతుందా…..తమ అనుయాయులకు టికెట్స్ ఇప్పించుకుంటారా..? అనేది ఆసక్తిగా మారింది…అంతే కాకుండా పొంగులేటి ఉన్న మూడు జనరల్ స్థానాల్లో ఎక్కడ నుంచి పోటీచేస్తారు …ఖమ్మం నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్నా , ఆయన మాత్రం కొత్తగూడెం వైపు చూస్తారని అంటున్నారు . ఆయన ఖమ్మం నుంచే పోటీచేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ఆయనకు ఎక్కడ నుంచి పోటీచేయమంటుంది….అనేది డైలామాగా మారింది … అసెంబ్లీకి పోటీచేయకుండా ఆగి పార్లమెంట్ కు పోటీచేయిస్తుందా అనే చర్చ జరుగుతుంది…

కేసీఆర్ , కేటీఆర్ మాటలను నమ్మి పార్టీలో చేరితే కనీసమర్యాద లేకుండా చేయడంతో ఆత్మగౌరం దెబ్బతిన్నట్లుగా భావిస్తున్నారు …మాటతప్పడం కక్ష సాధింపు చర్యలు పూనుకోవడం లాంటి చర్యలపై పొంగులేటి జీర్ణించుకోలేక పోతున్నారు .. అందుకే ఆయన కేసీఆర్ పై అణువణువు ఆక్రోశం నింపుకున్నారు … అందుకే ఆయన ఎక్కడకు వెళ్లిన కేసీఆర్ టార్గెట్ గానే విమర్శలు గుప్పిస్తున్నారు . పిట్టలదొర మాటలు నమ్మవద్దని హెచ్చరికలు జారీచేస్తున్నారు . గిరిజన దినోత్సం సందర్భంగా ఇల్లందు , కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించిన పొంగులేటి గిరిజన ద్రోహి కేసీఆర్ అంటూ ద్వజామెత్తారు . ఉమ్మడి జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్ గిరిజనులను నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు .. పోడుభూముల సమస్య అపరిష్కృతంగా ఉందని గిరిజనులు కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు .గిరిజనులకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరిగిందని వారికీ చెప్పి కాంగ్రెస్ కు వారిని అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ..

ఆయన వెంట వచ్చినవారికి ఎంతమందికి టికెట్స్ ఇప్పిస్తారు …తాను ఎక్కడ నుంచి పోటీచేస్తారు …అనేది ఇప్పుడు వేయి డాలర్ల ప్రశ్నగా ఉంది. కాంగ్రెస్సా …? బీజేపీ లోకి దేనిలోకి వెళ్లాలని చాలాకాలం ఉగిసలాడిన పొంగులేటి చివరికి అనేక మంది అభిప్రాయాలు తీసుకోని కాంగ్రెస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు . కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఖమ్మం రప్పించి పెద్ద బహిరంగసభ పెట్టించి అధిష్టానం దృష్టిలో కూడా పెడ్తారు …జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందిన నాయకుడైయ్యారు . కాంగ్రెస్ కూడా ఆయనకు ప్రచార కమిటీ కో – చైర్మన్ ఇవ్వడం, ఎన్నికల కమిటీలోచోటు కల్పించడం ద్వారా సరైన గుర్తింపునే ఇచ్చింది…

ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు గెలిపించడం కాంగ్రెస్ లక్ష్యంగా మారింది …2018 ఎన్నికల్లో హేమ హేమీలు అయిన మాజీమంత్రి తుమ్మల , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,జలగం వెంకట్రావు లాంటి వారు ఉన్నారు .అయినప్పటికీ బీఆర్ యస్ కు వచ్చింది ఒక్క సీటే ..అప్పడు బీఆర్ యస్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు . కాంగ్రెస్, సిపిఐ ,టీడీపీ కల్సి పోటీచేశాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాని మిత్రులకు 8 సీట్లు రాగ , ఒక స్వతంత్ర అభ్యర్థి సైతం గెలుపొందారు . ఎవరు లేనప్పుడే మాకు అన్ని సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు బలముందని చెపుతుంటారు ..అయితే ఈసారి కాంగ్రెస్ కు ఎవరితో పొత్తు లేదు …పైగా ఒంటరి పోరాటం , బీఆర్ యస్ అధికారంలో ఉంది . గత ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ పార్టీల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థితో కలుపుకొని 8 మంది ఎమ్మెల్యేలు అధికార తీర్ధం పుచ్చుకున్నారు . ప్రస్తుతం జిల్లాలో బీఆర్ యస్ కు 8 మంది ఉండగా కాంగ్రెస్ కు సీఎల్పీ నేత భట్టి మధిర నుంచి , భద్రాచలం నుంచి పొదెం వీరయ్య ఉన్నారు .

అయితే కాంగ్రెస్ కు ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో ఉన్న మొత్తం 10 సీట్లు గెలుస్తామని పొంగులేటి అంటున్నారు . ఆయనేంటి గెలిపించేది గత ఎన్నికల్లోనే తాము ఆరు సీట్లు మా మిత్రులు రెండు సీట్లు గెలిచారని కాంగ్రెస్ నేతలే అంటుండటం గమనార్హం… నిజంగా ఇప్పుడు 10 సీట్లు గెలుస్తారా ..? అది సాధ్యమేనా …? అంటే అనుమానమే …అధికార పార్టీ కూడా ఈసారి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిచేందుకు తమకున్న అన్ని హంగులను ఉపయోగించుకునేందుకు సిద్ధపడుతుంది.. సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు …జిల్లాకు ప్రత్యేక పరిశీలకులుగా మంత్రి హరీష్ రావు ను నియమించారని బీఆర్ యస్ వర్గాలు అంటున్నాయి….చూద్దాం ఏమి జరుగుతుందో మరి.. …!

Related posts

టీడీపీ నిర్ణయం సరైందే నని హై కోర్ట్ తీర్పు తో రుజువైంది … చంద్రబాబు

Drukpadam

ఏపీ ప్రాజెక్టులు అక్రమం… ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం: సీఎం కేసీఆర్…

Drukpadam

తెలంగాణ నేతల తీరుపై కేసీ వేణుగోపాల్ అసహనం ..ఇదేమి పద్దతి అంటూ క్లాస్

Ram Narayana

Leave a Comment