Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయం….ఢిల్లీలో బిజీ ,బిజీ …

నేడు రాహుల్‌ , ఖర్గేతో భేటీ?

  • కాంగ్రెస్‌లో వైఎస్సార్‌‌టీపీని విలీనం చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం
  • బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లిన షర్మిల
  • పార్టీ విలీనంపై ఖర్గే, రాహుల్‌ గాంధీతో చర్చించే అవకాశం

వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయం …
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే ,రాహుల్ తో భేటీ
బేషరత్ గానే కాంగ్రెస్ లోకి …
ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ…
ఇంకా కాంగ్రెస్ నుంచి రాని స్పష్టత …

స్వర్గీయ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖరారు అయింది. ఆమె చేరిక విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అనుకూల ప్రతికూల వాదులు ఉన్నారు .ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి షర్మిల చేరికను తీవ్రంగా వ్యతిరేకించిరని తెలిసింది.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం ఆమె చేరిక సానుకూల పరిణామమని అన్నారు . కోమటి రెడ్డి లాంటి వారు కూడా స్వాగతిస్తున్నారు . కెవిపి లాంటి సీనియర్ నాయకులు తెరవెనక మంత్రాంగం చేశారు . ఎట్టకేలకు షర్మిల చేరికకు ఆడిస్తాం గ్రీన్ సిగ్నలు ఇచ్చింది. దీంతో ఆమె ఆఘమేఘాల మీద కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు .

వైఎస్సార్‌‌ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం  జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి షర్మిల వెళ్లారు. బెంగళూరు నుంచి హస్తిన చేరుకున్న ఆమె.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు సమాచారం. 

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌‌టీపీ విలీనంపై వీరితో షర్మిల చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారంలోనే కాంగ్రెస్ కీలక నేత సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు షర్మిల సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి షరతులు లేకుండానే తన పార్టీని విలీనం చేసేందుకు ఒప్పుకున్నట్లు చర్చ సాగుతోంది. పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగుతారని నేతలు చెబుతున్నారు. అయితే పార్టీలో చేరిన తర్వాత ఆమెను పార్టీ ఏవిధంగా ఉపయోగించు ఉంటుందనే ఆసక్తి నెలకొన్నది … రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణ లో సుమారు 4 వేల కి .మీ పాదయాత్ర చేశారు . వైయస్ ఆర్ ముద్దుల కూతురుగా ఆమెకు ప్రజల్లో కూడా మంచి క్రేజీ ఉంది. ఆమె చేరిక రాష్ట్రలో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుందనే అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమె పోటీ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది . పాలేరు నుంచి పోటీ చేయిస్తుందా …? లేక సికింద్రాబాద్ నుంచి పోటీ చేయిస్తుందా ..? పార్లమెంట్ కు పోటీచేయిస్తుందా అనే ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి…

Related posts

ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన… ఈసీ అధికారిక గుర్తింపు!

Drukpadam

పంట పొలాల్లో రేవంత్ రెడ్డి… రాహుల్ స‌భ‌కు రావాలంటూ రైతుల‌కు ఆహ్వానం!

Drukpadam

కొత్త జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తున్నాం… హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేయాలి :బాలకృష్ణ

Drukpadam

Leave a Comment