Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ప్రజాస్వామ్య పరిరక్షణలో కలాలు, గళాలుఐజెయు నేత రాంనారాయణ

ప్రజాస్వామ్య పరిరక్షణలో కలాలు, గళాలు
ఐజెయు నేత రాంనారాయణ

ప్రెస్ క్లబ్ ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు ప్రజాపక్షం / ఖమ్మం : ప్రజాస్వామ్య పరిరక్షణకు కలాలు, గళాలు ఐక్యం కావాలని దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తెలిపారు. పాలకుల తీరుతో దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు సన్నగిల్లుతున్నాయని ఇటువంటి సమయంలో జర్నలిస్టులు తమ పాత్రను తాము నిర్వర్తించి ప్రజాస్వామ్య పరిరక్షణకు కలాన్ని ఆయుధంగా చేయాలని ఆయన కోరారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా స్థానిక ప్రెస్లబ్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం: ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైసా పాపారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంనారాయణ మాట్లాడుతూ మునుపెన్నడు లేని రీతిలో మతం రాజకీయ అంశంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ, మెజార్టీల ప్రాతిపదికన పాలన సాగితే దేశంలో అశాంతి రగులుతుందని ఇది దేశ భవిష్యత్తు శ్రేయస్కరం కాదని ఆయన తెలిపారు. 77 ఏళ్ల తర్వాత కూడా స్వాతంత్య్రానికి పూర్వపు పరిస్థితులు కొన్ని ప్రాంతాలలో కనపడుతున్నాయని అధికారం కోసం అడ్డదారి తొక్కే విధానం దీన దీన ప్రవర్ధమానమవుతుందన్నారు. దేశ స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం కలకలాం వర్ధిల్లేలా ప్రతి ఒక్కరి నడవడిక ఉండాలని ఆయన ఉద్భోదించారు. ఆర్థిక అంతరాలు పెరగడం కూడా దేశంలో అశాంతి రగిలేందుకు కారణమవుతుందని ఇప్పటికైనా ఆర్థిక అంతరాల పై పాలకులు దృష్టి సారించాలన్నారు. ఏ దేశంలో జర్నలిస్టు కలం, గళం స్వేచ్ఛగా పని చేస్తుందో ఆ దేశంలో సుదీర్ఘ కాలం ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్రనాయకులు సర్వనేని వెంకట్రావు, సామినేని మురారి, మాటేటి వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించగా యూనియన్ నాయకులు ప్రెసబ్ కార్యదర్శి కూరాకులు గోపి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి నామ పురుషోత్తం, యూనియన్ నాయకులు నలజాల వెంకట్రావు, తాళ్లూరి మురళికృష్ణ, జనార్ధనాచారి, ఎండి మోహినుద్దీన్, ఏలూరి వేణుగోపాల్, కె. వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్రీధర్, మహేందర్, నాగేశ్వరరావు, కళ్యాణ్, కొమ్మినేని ప్రసాదరావు, నారాయణరావు, వివిధ పత్రికలు, ఛానెళ్ల స్టాఫ్ రిపోర్టర్లు, కెమెరామెన్లు, వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

క్లిన్ అండ్ గ్రీన్ సిటీగా ఖమ్మంను తీర్చు దిద్దాలి …మంత్రి తుమ్మల

Ram Narayana

ఖమ్మం జిల్లాలో షార్ట్ లిస్ట్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే …!

Ram Narayana

పెద్ద అధికారుల కనుసన్నల్లోనే అక్రమార్కులకు రెగ్యులైరైజేషన్

Ram Narayana

Leave a Comment