Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పొంగులేటి షాక్ ….ముఖ్య అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై …

పొంగులేటి షాక్ ….ముఖ్య అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై …
తిరిగి బీఆర్ యస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన తెల్లం
పొంగులేటితోపాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తెల్లం
పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు
మళ్లీ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడి
భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని వ్యాఖ్య

ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెంకట్రావు తెలిపారు. జులై 2 వ తేదీన ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్ సమక్షంలో పొంగులేటితో పాటు తెల్లం వెంకట్రావు రాహుల్ చేతులమీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు …ఈ సందర్భంగా పొంగులేటి సైతం తన బలం బలగం గురించి రాహుల్ కు పరిచయం చేశారు ..రాష్ట్రంలో కేసీఆర్ పాలన అంతమే తన పంతమని ప్రకటించారు . అంతే కాదు జిల్లాలో 10 కి 10 అసెంబ్లీ సీట్లు గెలిపించి ఒక్క బీఆర్ యస్ అభ్యర్థిని కూడా గెలవనివ్వనని , అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేశారు . కానీ కొద్దిరోజుల్లోనే ఒక్కరుగా ఆయన ముఖ్య అనుచరులుగా ఉన్నవారు ఒక్కరుగా తిరిగి బీఆర్ యస్ గూటికి చేరుకోవడం కొంత ఇబ్బంది కరంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు …గత నెలలో పొంగులేటి అనుచరుడిగా ముద్రపడిన ఖమ్మం నగరానికి చెందిన ఆకుల మూర్తి మంత్రి పువ్వాడ ఆధ్వరంలో రాష్ట్ర మంత్రి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను కలిసి బీఆర్ యస్ లో తాను కొనసాగుతానని ప్రకటించారు .

తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై చెపుతూ … భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తాను కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని చెప్పారు. పొంగులేటి ప్రధాన అనుచరుడిగానే తాను కాంగ్రెస్ లో చేరానని.. అయితే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక మళ్లీ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తనతో పాటు వచ్చిన కార్యకర్తలకు కూడా బీఆర్ఎస్ లో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే బీఆర్ఎస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలపడం గమనార్హం ….

దీంతో పొంగులేటి కాంగ్రెస్ లో చేరక ముందు వెంట అనేక మంది అనుచరుల్లో కొందరు పార్టీ వీడటంపై గుసగుసలు బయలు దేరాయి. అనేక మంది పొంగులేటి తో ఉంటె తమకు అసెంబ్లీ టికెట్స్ వస్తాయని ఆశించారు . కానీ కాంగ్రెస్ అధిష్టానం పెట్టిన నియమ నిబంధనల వల్ల తమకు టికెట్స్ రావని భావించిన పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరిన మరికొందరు గుడ్ బై చెపుతారని టాక్ నడుస్తుంది……

Related posts

జనసేనతో కలిసి పని చేయండి: కిషన్ రెడ్డికి అమిత్ షా సూచన

Ram Narayana

 పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి కేటీఆర్.. పోయిన బలం పెంచుకునేందుకే!

Ram Narayana

కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే అవకాశం…బండి సంజయ్ బాంబ్…

Ram Narayana

Leave a Comment