Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెళ్లిపీటలు ఎక్కబోతున్న వంగవీటి రాధా.. పెళ్లికూతురు ఎవరంటే..!

  • నర్సాపురంకు చెందిన పుష్పవల్లితో రాధా వివాహం
  • ఈ నెల 19న ఎంగేజ్ మెంట్.. అక్టోబర్ లో పెళ్లి
  • ఏలూరు మున్సిపల్ మాజీ ఛైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీల కుమార్తె పుష్పవల్లి

వంగవీటి వారింట త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. దివంగత వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నర్సాపురం పట్టణానికి చెందిన పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమయిందని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 

నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాని, బాబ్జీల చిన్న కుమార్తె పుష్పవల్లి. ఈ నెల 19న నర్సాపురంలో రాధాకృష్ణ, పుష్పవల్లిల ఎంగేజ్ మెంట్ జరగబోతోంది. అక్టోబర్ లో వీరి వివాహం జరగనుంది. మరోవైపు రాధా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తతో వంగవీటి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాము ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయిందని అంటున్నారు. రాధా మ్యారేజ్ న్యూస్ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఆసక్తిని రేపుతోంది.

Related posts

మహాప్రస్థానంలో ముగిసిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంత్యక్రియలు…

Drukpadam

ఖమ్మం లో మంకీ ఫాక్స్ కలకలం…?

Drukpadam

గురువు శ‌వ‌పేటిక‌ను మోసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్!

Drukpadam

Leave a Comment