Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఢిల్లీలో నెహ్రూ పేరిట ఉన్న మ్యూజియం పేరు మార్పు

  • నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రెరీ సొసైటీగా మార్పు
  • సోషల్ మీడియాలో వెల్లడించిన మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్
  • ప్రజాస్వామీకరణలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు వెల్లడి 

దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రముఖ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీ పేరును కేంద్రం తాజాగా మార్చింది. మ్యూజియం కొత్త పేరు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రెరీ సొసైటీగా ఖరారు చేసింది. ఈ మేరకు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్ నృపేంద్ర మిశ్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పేరును అధికారికంగా మార్చారు. ప్రజాస్వామీకరణ క్రతువులో భాగంగా ఈ మార్పు చేసినట్టు నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. 

సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జూన్‌లో జరిగిన ఓ సమావేశంలో పేరుమార్పు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొన్ని విధానపరమైన లాంఛనాలు పూర్తి చేసేందుకు కొంత సమయం పట్టిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14 నుంచి కొత్త పేరు అమల్లోకి రావాలని అప్పట్లో మ్యూజియం అధికారులు నిర్ణయించారు. 

వాళ్ల మాదిరి మీరు చరిత్రను సృష్టించలేరు.. అందుకే పేర్లు మారుస్తున్నారు: సంజయ్ రౌత్

  • ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును మార్చిన కేంద్రం
  • ఇక వాళ్లకు మిగిలింది ఏముందని సంజయ్ రౌత్ ఎద్దేవా
  • చరిత్రలో పండిట్ నెహ్రూ పేరును మార్చలేరని వ్యాఖ్య
You can not change the Pandit Nehru name in history says Sanjay Raut

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఢిల్లీలో ఉన్న మెమోరియల్ మ్యూజియం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చారు. ప్రజాస్వామికీకరణలో భాగంగానే ఈ మార్పును చేసినట్టు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఇక వాళ్లకు మిగిలింది ఏముందని ఆయన ప్రశ్నించారు. ఒక బిల్డింగ్ కు ఉన్న పేరును మాత్రమే మీరు మార్చగలరని… చరిత్రలో పేర్కొన్న పండిట్ నెహ్రూ పేరును మార్చలేరని విమర్శించారు. మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సావర్కర్ మాదిరి మీరు చరిత్రను సృష్టించలేరని… అందుకే పేర్లను మార్చే పని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

Related posts

సౌరవ్ గంగూలీ మమతతో విదేశీ టూర్ పై విమర్శలు …తనకు నచ్చిన చోటుకు వెళతానన్న దాదా …!

Ram Narayana

కేంద్రంలో సంకీర్ణమే …రాష్ట్రంలో బీఆర్ యస్ 12 సీట్లు గెలవబోతుంది…కేసీఆర్

Ram Narayana

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

Ram Narayana

Leave a Comment