Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో బీఆర్ఎస్ చేసేదేమీ లేదు.. తెలంగాణలో మా సత్తా ఏంటో బీఆర్ఎస్ కు చూపిస్తాం: శివసేన

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన శివసేన
  • సరిహద్దు నియోజకవర్గాలపై దృష్టిసారించామన్న శివసేన తెలంగాణ అధ్యక్షుడు
  • హైదరాబాద్ లో జరిగే సభకు ఏక్ నాథ్ షిండే హాజరవుతారని వెల్లడి

బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకలాపాలను మహారాష్ట్రకు విస్తరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ సంచలన ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ప్రకటించింది. తెలంగాణలో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ వెల్లడించారు. 

మహారాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లోని నియోజకవర్గాలపై దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎంలు రహస్య మిత్రులని… వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు శివసేన సత్తా ఏమిటో రుచి చూపిస్తామని అన్నారు. హైదరాబాద్ లో శివసేన బహిరంగసభను నిర్వహించబోతున్నామని… ఈ సభకు ఏక్ నాథ్ షిండే హాజరవుతారని తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదని శివాజీ అన్నారు. ఇదే సమయంలో తెలంగాణపై శివసేన ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుందని చెప్పారు.

Related posts

రాహుల్ గాంధీ మరో యాత్ర.. ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరుతో మణిపూర్ టు ముంబై

Ram Narayana

272 సీట్లు గెలవకుంటే బీజేపీ వద్ద ప్లాన్ ‘బీ’ ఉందా? అని అడిగితే అమిత్ షా సమాధానం ఇదీ…!

Ram Narayana

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకు పంచేస్తుంది.. మోదీ సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

Leave a Comment