Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

టైమ్స్ నౌ సర్వే లో మోడీ , జగన్ , కేసీఆర్ లకు తిరుగు లేదు …

టైమ్స్ నౌ సర్వే లో మోడీ , జగన్ , కేసీఆర్ లకు తిరుగు లేదు …
కేంద్రంలో మళ్లీ మోదీనే.. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఎన్డీయే ఘన విజయం…
ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్
ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తే తెలంగాణలో బీఆర్ యస్ దే హావా…!

తెలంగాణాలో …

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..!: టైమ్స్ నౌ సర్వే
బీఆర్ఎస్ కు 9 నుంచి 11 సీట్లు వస్తాయన్న సర్వే
కాంగ్రెస్ కు 3 నుంచి 4 స్థానాలు వస్తాయని వెల్లడి
బీజేపీ 2 నుంచి 3 సీట్లు గెలుచుకుంటుందన్న సర్వే

లోక్ సభ ఎన్నికలకు దేశంలోని అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తే ఫలితాల సరళి ఎలా ఉండబోతోందో తన సర్వేలో టైమ్స్ నౌ వెల్లడించింది. తెలంగాణ విషయానికి వస్తే అధికార బీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యతను నిలబెట్టుకుంటుందని సర్వే తెలిపింది.

మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను బీఆర్ఎస్ 9 నుంచి 11 సీట్లను గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 4 స్థానాలు వస్తాయని తెలిపింది. బీజేపీకి 2 నుంచి 3 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుందని తెలిపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9, బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 సీట్లు రాగా… ఎంఐఎం ఒక స్థానంలో గెలిచింది.

కేంద్రంలో మళ్లీ మోదీనే.. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఎన్డీయే ఘన విజయం…

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ జరిపిన సర్వే ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. దేశంలో ప్రధాని మోదీ హవా ఏమాత్రం తగ్గలేదని సర్వే స్పష్టం చేస్తోంది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తే ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని… మోదీ వరుసగా మూడో సారి ప్రధాని కావడం ఖాయమని సర్వే తెలిపింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమికి 296 నుంచి 326 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. విపక్ష పార్టీల ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది.

అధికార, విపక్ష కూటముల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లను గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ సొంతంగా 62 నుంచి 80 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే రెండు కూటమిలకు మధ్య ఓట్ల శాతంలో తేడా మాత్రం చాలా తక్కువగానే ఉండబోతోందని పేర్కొంది. ఎన్డీయేకు 42.60 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 40.20 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్

వచ్చే ఏడాది ఏప్రిల్ – మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశ వ్యాప్తంగా అప్పుడే ఎన్నికల హడావుడి నెలకొంది. దీంతో పాటు ఈ డిసెంబర్ లోపల పలు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మరోవైపు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు? అనే అంశాలపై పలు మీడియా సంస్థలు సర్వేలు చేపడుతూ, ఆసక్తికర అంచనాలను వెలువరిస్తున్నాయి. తాజాగా, టైమ్స్ నౌ తన సర్వే వివరాలను వెల్లడించింది.

ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. టీడీపీ, జనసేన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అంచనా వేసింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను వైసీపీకి 24 నుంచి 25 సీట్లు రావచ్చని తెలిపింది. టీడీపీకి ఒక్క సీటు రావచ్చని… లేకపోతే ఆ ఒక్క సీటు కూడా రాకపోవచ్చని వెల్లడించింది. జనసేన ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. జూన్ 15 నుంచి ఆగస్ట్ 12వ తేదీ మధ్య ప్రజల అభిప్రాయాలను సేకరించినట్టు తెలిపింది. గత లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. టైమ్స్ నౌ తాజా సర్వేను పరిశీలిస్తే వైసీపీ మరింత బలపడబోతోంది.

Related posts

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషలు ఎత్తివేసే కుట్ర …సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ..

Ram Narayana

తెలంగాణాలో కాంగ్రెస్ గెలవబోతుంది..రాహుల్ గాంధీ …!

Ram Narayana

ఇండియా కూటమిలోనే ఉన్నాం… మమతా బెనర్జీ

Ram Narayana

Leave a Comment