Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

వెంకటరావు భవిష్యత్తుకు భరోసా మాది: కేటీఆర్
మళ్లీ బీఆర్ఎస్ లో చేరిన తెల్లం వెంకటరావు
రానున్న రోజుల్లో భద్రాచలంను అభివృద్ధి చేస్తామన్న కేటీఆర్
మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అని ధీమా

పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో మళ్లీ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలోనే తాను చేసిన తప్పును వెంకటరావ్ గ్రహించారని చెప్పారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టేననే విషయం ఆయనకు అర్థమయిందని అన్నారు. వెంకటరావు భవిష్యత్తుకు భరోసా తమదని చెప్పారు.

ప్రాజెక్టుల పునరుద్ధరణతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, కోటి ఎకరాల్లో సాగు జరుగుతోందని కేటీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. నీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు లేవని చెప్పారు. ఎవరు ఎంత మొరిగినా మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. రానున్న రోజుల్లో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, గోదావరి కరకట్ట మరమ్మతు పనులు కూడా చేపడతామని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించిన తర్వాత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి పనులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు . భద్రాచలం కు చెందిన డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ యస్ చేరిక సందర్భంగా బీఆర్ యస్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారన్నారు .
పని చేసిన, అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజల పైన ఉన్నదన్నారు .

ఖమ్మం జిల్లా బిడ్డగా నా జీవితంలో ఎప్పుడు చూడని అభివృద్ధి 9 సంవత్సరాలలో జరిగిందని పేర్కొన్నారు . ఒకప్పుడు గుడేలకి, తండాలకి రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు లేకుండే.. మంచినీళ్లు లేకుండే… మిషన్ భగీరథ ద్వారా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనులకు లక్షన్నర ఎకరాలకు పట్టాలు ఇచ్చిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్అన్నారు . దశాబ్దాలుగా గతంలోని ప్రభుత్వాన్ని పట్టించుకోని పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులకు ఎనలేని సహాయం చేశారన్నారు .

ఈకార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ,మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు , ఎమ్మెల్సీలు తాతా మధు , మధుసూదన చారి తదితరులు పాల్గొన్నారు .

Related posts

సీఎం కేసీఅర్ పై తుమ్మల సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

సీఎం పదవిపై తన మనసులో మాట వెల్లడించిన కేటీఆర్

Ram Narayana

తెలంగాణ ప్రగతిభవన్ ఇకనుంచి జ్యోతిరావు పూలె ప్రజాభవన్…

Ram Narayana

Leave a Comment