ఖమ్మం వార్తలు

పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ ఖాయం : సీపీఐ నేత కూనంనేని

పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ ఖాయం : సీపీఐ నేత కూనంనేని
సింగరేణి కార్మిక సమాఖ్య సమావేశంలో కూనంనేని వ్యాఖ్యలు
సీపీఐ బరిలోకి దిగుతుందని స్పష్టం చేసిన రాష్ట్ర కార్యదర్శి
బీఆర్ఎస్, కమ్యూనిస్ట్‌ల పొత్తుపై అంచనాల నేపథ్యంలో వ్యాఖ్యలు

బీఆర్ యస్ తో సిపిఐకి పొత్తు ఉన్న లేకున్నా తమ పార్టీ కొత్తగూడెం లో పోటీచేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు . తమకు బలమున్న చోట పోటీచేయకుండా ఎవరు తమను ఆపలేరని కుండబద్దలు కొట్టారు . బీఆర్ యస్ కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని ఉభయ కమ్యూనిస్టులం అనుకున్నాం కానీ బీఆర్ యస్ వైపు నుంచి సరైన స్పందన రావడంలేదు . అందువల్ల తాము పోటీచేయదల్చుకున్న నియోజకవర్గాల్లో కొత్తగూడెం , వైరా , హుస్నాబాద్ , మునుగోడు , బెల్లంపల్లి ఉన్నాయని అన్నారు . సిపిఐ పోటీచేసే దగ్గర సిపిఎం , సిపిఎం పోటీచేసే దగ్గర సిపిఐ పోటీచేయకూడదని ఒక అంగీకారానికి వచ్చామని అన్నారు .

మునుగోడు ఉపఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, కమ్యూనిస్ట్‌లు కలిసి వెళ్తారనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మిక సమాఖ్య సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో సీపీఐ బరిలోకి దిగుతుందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్లు చెప్పారు.

పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం, వైరా నియోజకవర్గాలను సీపీఐ కోరుతుందని అన్నారు . మరోవైపు ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తాము పోటీలో ఉంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూనంనేని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కూనంనేని 2009లో కొత్తగూడెం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018లో ఓడిపోయారు.

Related posts

సిపిఎంకు వేసే ప్రతి ఓటు ఒక పోరాట ఆయుధమే…సిపిఎం అభ్యర్థి శ్రీకాంత్

Ram Narayana

ఖమ్మంలో కాంగ్రెస్ , బీఆర్ యస్ , బీజేపీ మధ్య తీవ్ర పోటీ

Ram Narayana

డిసెంబరు 13 నుంచి భద్రాద్రిలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

Ram Narayana