Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

బీహార్ లో దారుణం…జర్నలిస్ట్ ను కాల్చి చంపిన దుండగులు …

-బీహార్ లో దారుణం…జర్నలిస్ట్ ను అతని ఇంట్లోనే కాల్చి చంపిన దుండగులు …
-బీహార్‌లోని అరారియా జిల్లాలో తెల్లవారుఝామున ఘటన
-దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జర్నలిస్ట్ సమాజం …
-దైనిక్ జాగరణ్ లో పనిచేస్తున్న విమల్ యాదవ్ ..
-దుండగులు నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లి ఛాతీపై గురిపెట్టిన కాల్పులు
-అక్కడిక్కడే మృతి చెందిన విమల్
-నిందితుల కోసం పోలీసుల వేట

బీహార్ లో దారుణం చేటుచేసుకుంది ….ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ లో పనిచేస్తున్న విమల్ యాదవ్ అనే జర్నలిస్టులు ఆయన ఇంట్లోనే దుండగులు కాల్చిచంపడం జర్నలిస్ట్ సమాజాన్ని దిగ్బ్రాంతికి గురిచేంది ..ఇది కచ్చితంగా మాఫియా గ్యాంగ్ పనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నితీష్ కుమార్ సర్కార్ తమ రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పిన కొద్దిరోజుల్లోనే ఒక ప్రముఖ పత్రిక జర్నలిస్ట్ ఈ హత్యకు గురికావడంపై ప్రతిపక్షాలు , జర్నలిస్ట్ సంఘాలు నితీష్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫ్యలానికి నిదర్శనమని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.

ఒక జర్నలిస్టు ఇంట్లో ఉండగా తెల్లవారు జామున తాపీగా నడుచుకుంటూ వచ్చిన కొందరు దుండగులు అతడిని తుపాకితో కాల్చి చంపారు. బీహార్‌లోని అరారియా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుడిని విమల్ యాదవ్‌గా గుర్తించారు. రాణిగంజ్‌లోని ఆయన ఇంటికి వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు విమల్ యాదవ్ తూటాల వర్షం కురిపించారు. ఛాతీ భాగం నుంచి తూటాలు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోస్టుమార్టం సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ, ఎంపీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

హత్యా స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను రప్పించామని అరారియా ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సంఘటనపై అరారియా జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేంద్ర సింగ్ స్పందిస్తూ, “ఉదయం ఒక విలేఖరిని కాల్చి చంపిన విధానం చాలా దిగ్భ్రాంతి కలిగించిందన్నారు . రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుని ఈసంఘటన ప్రతిబింబిస్తుందన్నారు . అతని సోదరుడు కూడా రెండేళ్ల క్రితం హత్య కు గురికావడం గమనార్హం … తన సోదరుడి హత్యతో సంబంధం ఉన్నవాళ్లకు శిక్ష పడాలని విమల్ కోరుకుంటున్నాడు ఇందులో అతను చురుకుగా ఉన్నాడు. తనకు పదే పదే బెదిరింపులు వస్తున్నాయని, ఆ సమాచారాన్ని పోలీసులకు కూడా అందజేస్తున్నాడని చెబుతున్నారు.

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్, నితీష్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు, “ఇక్కడ ఏ తరగతిని లక్ష్యంగా చేసుకోవడం లేదు, జర్నలిస్టులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు, వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రజలను విడివిడిగా టార్గెట్ చేస్తున్నారని ప్రభుత్వం విమర్శలు గుప్పించారు . ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకేమి పట్టనట్లు ఢిల్లీ వెళ్లేందుకు బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు .

ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి దిగ్బ్రాంతి

బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలో దైనిక్ జాగరణ్ లో పనిచేస్తున్న విమల్ యాదవ్ అనే జర్నలిస్ట్ ను శుక్రవారం తెల్లవారు జామున ఆయన నివాసంలోనే కాల్చిచంపడం పై ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్మూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు . ఈ సంఘటన అత్యత పాశవికం , మాఫియా గ్యాంగ్ లు భావప్రకటనా స్వేచ్ఛపై చేస్తున్న దాడి ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల భద్రతా కోసం ప్రత్యేక చట్టం తీసుకోని రావాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది …తమ సంఘం ఎప్పటి నుంచో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనీ కోరుతున్నది.కానీ పాలకులు పట్టించుకోవడంలేదు . సంఘ విద్రోహులు , రాజకీయ పార్టీలు నిజాలు బయట పెడుతున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసికొని దాడులు చేయడం , హత్యలు చేయడం క్షమార్హం కాదు . దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలి …చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని శ్రీనివాస్ రెడ్డి బల్విందర్ జమ్ములు డిమాండ్ చేశారు ..

Related posts

9/11 ఉగ్రదాడి: సౌదీకి అమెరికా క్లీన్​ చిట్​…

Drukpadam

టెన్త్ పేపర్ లీకేజ్ కేసు.. ఈటల రాజేందర్ కు నోటీసులిచ్చిన పోలీసులు!

Drukpadam

నాది నైతిక రాజీనామా… ఇప్పుడు షిండే, ఫడ్నవీస్ రాజీనామా చేయాలి: ఉద్దవ్ థాకరే…

Drukpadam

Leave a Comment