Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

విచారణకు హాజరు కావాలంటూ ఝార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు

  • భూకబ్జా కేసులో సొరేన్ కు ఈడీ సమన్లు
  • ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసిన ఈడీ
  • వీరిలో ఒక ఐఏఎస్ కూడా ఉన్న వైనం

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 24 లోపల తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. భూకబ్జా కేసులో ఆయనకు సమన్లను పంపింది. వాస్తవానికి ఆగస్ట్ 14నే విచారణకు హాజరు కావాలని సొరేన్ ను ఈడీ ఆదేశించింది. అయితే, ఆనాటి విచారణకు ఆయన హాజరు కాలేదు. తనకు మరింత సమయం కావాలని అడిగారు. గతంలో మరో కేసులో ఈడీ విచారణకు సొరేన్ హాజరయ్యారు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి రాంచీలోని ఈడీ కార్యాలయంలో ఆయనను 10 గంటల సేపు విచారించారు.  

మరోవైపు భూకబ్జా కేసులో 13 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. వీరిలో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. జులై 8న సొరేన్ పార్టీ ఎమ్మెల్యే ప్రతినిధి నివాసంలో జరిపిన సోదాల్లో ఒక చెక్ బుక్ లభించింది. ఈ చెక్ బుక్ సీఎం బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయి ఉంది. దీంతో, ఈ కేసులో సొరేన్ ను కూడా చేర్చారు.

Related posts

దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికే… డీలిమిటేషన్: సీఎం రేవంత్ రెడ్డి!

Ram Narayana

కేంద్రమంత్రి గడ్కరీ సవాల్ …అవినీతి నిరూపిస్తే రాజకీయాలకు దూరం …పైసా అవినీతి మరక లేనివాడిని…

Ram Narayana

త్రివేణి సంగ‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పుణ్య స్నానం!

Ram Narayana

Leave a Comment