Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జూడాలతో ప్రభుత్వ చర్చలు విఫలం…

జూడాలతో ప్రభుత్వ చర్చలు విఫలం…
-సమ్మె యధాతదం అని ప్రకటించిన జూడాలు
-తమకు సరైన హామీ రాలేదు … లిఖిత పూర్వకంగా ఉండాలని డిమాండ్

సమ్మె విరమణపై బుధవారం డీఎంఈ రమేశ్‌ రెడ్డితో జూనియర్‌ డాక్టర్ల చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని.. రేపటి నుంచి సమ్మె యధావిధిగా కొనసాగుతుందని జూడాలు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు. చర్చల అనంరతం జూడాలు మీడియాతో మాట్లాడారు.

”రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోవిడ్ తో చనిపోయిన వారికి ఎలాంటి ఎక్స్ గ్రేషియా రాదన్నారు. కోవిడ్ సోకిన వైద్య సిబ్బందికి నిమ్స్లో బెడ్లు ఇచ్చే అంశం లేదన్నారు. 10శాతం కోవిడ్ ఇన్ సెంటివ్ లు కూడా ఇవ్వటం కుదరదన్నారు. ఈ ఏడాది జనవరి 1నుంచి లేక ఈ నెల నుంచి 15శాతం పే హైక్ ని ఇస్తామన్నారు. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదు.. రాత పూర్వక హామీ లేదు కాబట్టి విధుల్లో చేరాలా లేదా అన్న విషయంపై చర్చిస్తున్నాము. అధికారికంగా ప్రభుత్వం నుంచి రాత పూర్వక హామీ ఇస్తే విధుల్లో చేరుతాము. కేటీఆర్ ట్వీట్ చూసి సమ్మె విరమించాలని అనుకున్నాం.. కానీ డీఎంఈ తో జరిగిన చర్చల్లో మాకు సరైన హామీ రాలేదు.ప్రస్తుతానికి మా స్ట్రైక్ కొనసాగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు ,

Related posts

రేపు భారత రాష్ట్రపతి ఎన్నిక… పోలింగ్ కు సర్వం సిద్ధం

Drukpadam

తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల.. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్..!

Drukpadam

జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్‌పై స్పందించిన ఈటల రాజేందర్!

Drukpadam

Leave a Comment