తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ 105 మంది అభ్యర్థుల ప్రకటించే ఛాన్స్ …! ఉండేదెవరు / ..ఊడేదెవరు …?

బీఆర్ యస్ 105 మంది అభ్యర్థుల ప్రకటించే ఛాన్స్ …! ఉండేదెవరు / ..ఊడేదెవరు …?
అధికంకంగా సీట్టింగ్ లకే అవకాశం ….
10 నుంచి 15 మందిని మార్చే అవకాశం ….
ఖమ్మం జిల్లాలో ఇద్దరికీ నో ఛాన్స్ … వైరా , ఇల్లందు లలో అభ్యర్థుల మార్పు
కొత్తగూడం పై డౌట్ ఉన్న ….అయితే వనమా వైపే మొగ్గు …
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ , జనగాం అభ్యర్థుల మార్పుకు అవకాశం ..

బీఆర్ యస్ అదినేత సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రకటించనున్నారు …119 నియోజకవర్గాలు ఉండగా వాటిలో సోమవారం 105 మంది అభ్యర్థులను కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు . ముందుగా చెప్పినట్లుగానే చాలామంది సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వనున్నారు. బాగా వ్యతిరేకత గెలవలేరని సర్వేల్లో తేల్చి చెప్పిన వారిని మాత్రం పక్కన పడతారని సమాచారం… ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని వైరా , ఇల్లందు , ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొందరిని మార్చనున్నారు . వైరాలో బానోత్ మదన్ లాల్ పేరు వినిపిస్తుండగా , ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు లా కాలేజీ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధకు టికెట్ ఇవ్వాలనే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది… అదే సందర్భంలో జనగాం నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని డ్రాప్ చేయాలనీ అనుకున్న అక్కడ పోటీచేయాలని భావిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడంతో దానిపై సందేహాలు ఉన్నాయి. ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి కి సీటు అని ప్రచారం జరుగుతుంది.

అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని అందుకోసం సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారని ప్రకటించడంతో ఆశావహుల్లో , సీట్టింగ్ ల్లో ఉత్కంఠ బయలుదేరింది…ఎవరు ఉంటారో , ఎవరు ఉడతారో అనే ఆసక్తి నెలకొన్నది ..

Related posts

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ

Ram Narayana

 బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడంపై పవన్ కల్యాణ్ వివరణ

Ram Narayana

ఫాంహౌస్ లో తీవ్ర భావోద్వేగం… కవితను ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్

Ram Narayana