తుమ్మలను పట్టించుకోని బీఆర్ యస్ …ఆయన చూపు ఎటు వైపు …?
కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుందా…? బీజేపీ గాలానికి చిక్కుతారా …?
తుమ్మల చుట్టూ ఖమ్మం రాజకీయాలు
పార్టీ ఏదైనా పాలేరులో పోటిఖాయమంటున్న తుమ్మల
పాలేరు సీటు తిరిగి కందాలకు కేటాయించడంపై గుర్రుగా ఉన్న తుమ్మల వర్గీయులు
హైద్రాబాద్ లో అనుచరులతో అత్యవసర సమావేశం…
ఆయన్ను బుజ్జగించేందుకు రంగంలోకి హరీష్ రావు …
మాజీ మంత్రి,రాజకీయ దురంధరుడిగా పేరున్నతుమ్మల నాగేశ్వరరావు కు కేసీఆర్ టికెట్ నిరాకరించారు .దీంతో ఆయన రాజకీయ ప్రస్థానం పై కారుమబ్బులు ముసురుకున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు .. ఆయన బలంగా ఆశించిన పాలేరు టికెట్ బీఆర్ యస్ అధినేత కేసీఆర్ ఆయనకు ఇవ్వలేదు…జిల్లా నేతలు ఆయన ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన సంగతి నేను చూసుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్ కీలక నేతకు టికెట్ నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది . పైగా గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ యస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తుమ్మల వర్గీయులు రగిలి పోతున్నారు . తమకు అవమానం జరిగిన తర్వాత గులాబీ పార్టీలో ఎందుకు ఉండాలని ఆయనపై వత్తిడి తెస్తున్నారు . పార్టీ ఏదైనా ఎట్టి పరిస్థితిల్లో పాలేరు నుంచి పోటీచేసి సత్తా చాటాలని కోరుతున్నారు ….దీంతో ఆయన తన ముఖ్య అనుచరులతో హైద్రాబాద్ లోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జిల్లా నేతలే కాకుండా ఆయనకు స్నేహితులుగా ఉన్న పలువురు ముఖ్యనేతలు హాజరైనట్లు సమాచారం. దీనిలో వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా తుమ్మల ఆలోచనలు చేస్తున్నారని సమాచార….
ఎంపీ సీటు ,జిల్లా బాధ్యతల ప్రతిపాదనపై కేసీఆర్ మాటలు నమ్మడానికి వీల్లేదని అందువల్ల పోటీచేయడంపై వెనక్కు తగ్గవద్దని డిమాండ్ చేస్తున్నారు . ఆయన్ను బుజ్జగించేందుకు ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు ను రంగంలోకి కేసీఆర్ దింపారని అయినప్పటికీ సీటు ఇవ్వకుండా ఎన్ని చెప్పిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు …జిల్లా ఎన్నికల భద్యతలను తీసుకుంటే ప్రయోజనం లేకపోగా అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుందని తుమ్మలను హెచ్చరిస్తున్నారు అనుయాయులు … 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమికి కారణాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకున్నప్పటికీ అదిజరగలేదు …పైగా సీనియర్ నేతకు అవమానం జరిగినట్లుగా భావిస్తున్నారు ..ఫలితంగా తుమ్మల అడుగులపై ఆసక్తి నెలకొన్నది …