Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో 3.06 కోట్ల మంది ఓటర్లు, అక్కడ జూబ్లీహిల్స్‌లో అత్యధిక ఓటర్లు!

  • తెలంగాణలో 3,06,42,333 కోట్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపిన ఎన్నికల సంఘం
  • 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళా ఓటర్లు
  • హైదరాబాద్‌లో చార్మినార్‌లో అత్యల్పంగా 2.16 లక్షల ఓటర్లు

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇందులో 1.53 కోట్లు పురుషులు, 1.52 కోట్లు మహిళలు, ఇతరులు 2,133 కోట్లు ఉన్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2,742 మంది ఎన్నారైలు, సర్వీస్ ఓటర్లు 15వేలకు పైగా ఉన్నారు.

18 నుండి 19 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు 4,76,597 మంది ఉన్నారు. జనవరిలో ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 2.99 కోట్లు. ఆ తర్వాత 8 లక్షలకు పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. కోటి మందికి పైగా తొలగించారు. ముసాయిదాపై సెప్టెంబర్ 19న అభ్యంతరాలు, వినతులు సమర్పించవచ్చునని సీఈవో తెలిపారు. అర్హత ఉండి, ఓటు హక్కు లేనివారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో 40 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.56 లక్షలు, అత్యల్పంగా చార్మినార్‌లో 2.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

Related posts

ప్రవేటీకరణ దిశగా ఎయిరిండియా…

Drukpadam

జీవో నెం.2 సస్పెన్షన్ ను స్వాగతించిన రాష్ట్ర పంచాయతీ పరిషత్…

Drukpadam

పెట్రోలియం డీలర్స్ సమస్యపై కేంద్రమంత్రికి టీఆర్ యస్ ఎంపీ వడ్ఢరాజు వినతి..

Drukpadam

Leave a Comment