Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణలో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు?

తెలంగాణలో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు?
రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న లాక్‌డౌన్
మంత్రి మండలిలో చర్చించిన అనంతరం నిర్ణయం
30న కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం
పలు అంశాలపై చర్చ
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 30తో లాక్‌డౌన్ ముగియనుంది. లాక్‌డౌన్ సత్ఫలితాలనే ఇచ్చిందని, మరికొన్ని రోజులు పొడిగిస్తే కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికితోడు రాష్ట్రంలో ఇప్పుడు రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కాబట్టి అమల్లో ఉన్న ఆంక్షలను కొంతమేర సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, 30న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, బ్లాక్ ఫంగస్‌కు చికిత్స, ఔషధాలు, రెండోదశ టీకాలు, కొవిడ్ పరీక్షల పెంపు, ఆక్సిజన్ ఉత్పత్తి, సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వానాకాలం పంటల ప్రణాళిక తదితర అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు .

Related posts

ఆంక్షలతో ఒమిక్రాన్ ఆగదు.. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికి సోకచ్చు!

Drukpadam

మహారాష్ట్రలో ఆసుపత్రి ఐసీయూలో మంటలు.. 13 మంది సజీవ దహనం

Drukpadam

కరోనా బెడ్​ పై నుంచే కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్​ సందేశం!

Drukpadam

Leave a Comment